గల్లీ టీమ్‌ కంటే దారుణం! వాళ్లను వెంటనే పీకేయండి.. పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్లు...

First Published | Nov 3, 2022, 1:22 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా, జింబాబ్వే చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకోగలిగింది. అయితే తొలి రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్, సెమీస్ ఆశలు దాదాపు ఆవిరైపోయాయి... పాక్ ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే అద్భుతాలు జరగాల్సిందే...

ఇండియా, జింబాబ్వేలతో జరిగిన మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన పాక్ సీనియర్ బ్యాటర్ ఫకార్ జమాన్... నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి.. 92  పరుగుల లక్ష్యఛేదనలో 16 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

Fakhar Zaman

ఈ మ్యాచ్ తర్వాత ఫకార్ జమాన్ మోకాలి గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొత్తానికి దూరమైనట్టు ప్రకటించింది పాక్ క్రికెట్ బోర్డు. ఒక్క మ్యాచ్ ఆడగానే ఫకార్ జమాన్ గాయపడ్డాడనే వార్త, పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది...


‘ఫకార్ జమాన్ తప్పేం లేదు. అతను ఒకే ఒక్క మ్యాచ్ ఆడగానే గాయపడి, టోర్నీ మొత్తానికి దూరమయ్యాడంటే దీనికి మెడికల్ ప్యానెల్, సెలక్టర్లు, కెప్టెన్, హెడ్ కోచ్ సమాధానం చెప్పాలి. సీనియర్ ప్లేయర్‌ని జాగ్రత్తగా చూసుకోలేకపోయిన మెడికల్ ప్యానెల్‌ని వెంటనే తొలగించాలి...

అసలు మెడికల్ ప్యానెల్ ఉన్నది ఎందుకు? వాళ్లకి ప్లేయర్ల గాయాల గురించి తెలీదా? గాయపడిన ప్లేయర్లను ఎలా ఎంపిక చేశారు? గాయంతో ఎలా ఆడనిచ్చారు? ఫిట్‌గా ఉండి, దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేస్తున్నవాళ్లు కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది...

Pakistan Team

గల్లీ టీమ్ కంటే ఘోరంగా ఒక్క మ్యాచ్ ఆడగానే ఆ ప్లేయర్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడంటే మెడికల్ ప్యానెల్ ఎలా పనిచేస్తుందో తెలుస్తోంది. వెంటనే అందులోని అందర్నీ ఉద్యోగం నుంచి పీకేయాలి... వాళ్లకి జీతాలు ఇవ్వడం కూడా వేస్ట్...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.. 

Latest Videos

click me!