క్రికెట్‌లో ఇప్పటి వరకు సచిన్‌, విరాట్‌లు సాధించలేకపోయిన రికార్డులు ఇవి..

Published : Aug 09, 2024, 06:10 PM IST

Unique Cricket Records: అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 34357 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో 26942 పరుగులు చేశాడు. కానీ, ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు తమ కెరీర్ లో ఇప్పటివరకు చేయలేని రికార్డు చాలానే ఉన్నాయి. వాటిలో...  

PREV
15
క్రికెట్‌లో ఇప్పటి వరకు సచిన్‌, విరాట్‌లు సాధించలేకపోయిన రికార్డులు ఇవి..
India vs Australia

Unique Cricket Records: ప్రపంచ క్రికెట్‌లోని గొప్ప బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో భార‌త స్టార్ ప్లేయ‌ర్లు  సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేర్లు టాప్ లో ఉంటాయి. ఎందుకంటే వీరు క్రికెట్ సాధించిన రికార్డులు చాలానే ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 80 సెంచరీలు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 34357 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 26942 పరుగులు చేశాడు. అయితే, క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి తన కెరీర్ సాధించ‌లేక‌పోయిన గొప్ప రికార్డుల్లో ట్రిపుల్ సెంచ‌రీలు ఒక‌టి. ఈ విష‌యంలో ప‌లువురు ప్లేయ‌ర్ల‌ను వీరు దాట‌లేక‌పోయారు. ప్ర‌పంచ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచ‌రీలు కొట్టిన ప్లేయ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే..

25
superstitions of indian cricketers

వీరేంద్ర సెహ్వాగ్ 

భారత డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌తో టెస్ట్ క్రికెట్ ఆడే విధానాన్ని మార్చాడు. సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌ను టీ20 క్రికెట్‌లా ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్ 2004లో పాకిస్థాన్‌పై తొలి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ముల్తాన్ మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్ 309 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే,  2008లో సెహ్వాగ్ చెన్నైలో దక్షిణాఫ్రికాపై 319 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

 

35
Virat Kohli-Lara-Sachin

బ్రియాన్ లారా

బ్రియాన్ లారా ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌ల‌లో ఒక‌రు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా బ్రియాన్ లారా ప్రపంచ రికార్డు సృష్టించాడు. బ్రియాన్ లారా 2004లో ఇంగ్లండ్‌పై 400 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 1994లో కూడా లారా ఇంగ్లండ్‌పై 375 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. లారా ఇలా రెండు బిగ్ ఇన్నింగ్స్‌లను ఆడాడు. 

45
Image credit: Getty

క్రిస్ గేల్ 

టీ20 క్రికెట్ ప్రపంచంలో సిక్సర్ల రారాజు క్రిస్ గేల్. రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా క్రిస్ గేల్ తన బ్యాటింగ్ సత్తా చాటాడు. 2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో క్రిస్ గేల్ 317 పరుగులు చేశాడు. అలాగే, 2010 లో క్రిస్ గేల్ శ్రీలంకపై 333 పరుగుల టెస్ట్ ఇన్నింగ్స్‌ను ఆడాడు.

55

డాన్ బ్రాడ్‌మాన్ 

గ్రేట్ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ తన టెస్ట్ కెరీర్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు కూడా సాధించాడు. డాన్ బ్రాడ్‌మాన్ తన రెండు ట్రిపుల్ సెంచరీలను ఇంగ్లాండ్‌పై  సాధించాడు. డాన్ బ్రాడ్‌మాన్ 1934లో ఇంగ్లండ్‌పై 334 పరుగులు, 1930లో అదే జట్టుపై 304 పరుగులు చేశాడు. డాన్ బ్రాడ్‌మాన్ తన క్రికెట్ కెరీర్‌లో 52 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో బ్రాడ్‌మాన్ బ్యాటింగ్ సగటు 99.94. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. 

Read more Photos on
click me!

Recommended Stories