ధోనీ అక్కడివాళ్లకు దేవుడు! అతని ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తది... డివాన్ కాన్వే కామెంట్స్...

First Published Jun 3, 2023, 3:35 PM IST

ఐపీఎల్‌ 2023 సీజన్ టైటిల్ గెలిచి, ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు ఓపెనర్ డివాన్ కాన్వే...

ఐపీఎల్ 2023 సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన డివాన్ కాన్వే, 139.7 స్ట్రైయిక్ రేటుతో 672 పరుగులు చేశాడు. ఆరు హాఫ్ సెంచరీలతో సీఎస్‌కే తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు డివాన్ కాన్వే...
 


‘ధోనీ గురించి ఎంతని చెప్పాలి, ఏం చెప్పాలి. అక్కడ (ఇండియాలో) ధోనీ దేవుడితో సమానం. అతనికి భక్తులు ఉన్నారు. ధోనీ క్రేజ్, ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తది. మేం ఎక్కడ మ్యాచులు ఆడినా స్టేడియం మొత్తం సీఎస్‌కే అభిమానులతో నిండిపోయింది..

వచ్చింది సీఎస్‌కే ఫ్యాన్స్ కాదు, ఎంఎస్ ధోనీ అభిమానులు. మాహీతో ఉన్నన్ని రోజులు ఏదో ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. ఇంత క్రేజ్ ఉండడం వల్ల ధోనీ తన హోటల్ గది నుంచి ఎక్కువగా బయటికి వచ్చేవాడు కాదు. ఎప్పుడైనా వస్తే అతని చుట్టూ అభిమానులు గుడిగూడిపోయేవాళ్లు..

సీఎస్‌కేలో ఉన్న ప్రతీ ప్లేయర్‌కి ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ అంటే చాలా గౌరవం. టీమ్‌ని ఎంతో పద్ధతిగా నడిపిస్తున్నారు. ఫ్రాంఛైజీ ఓనర్లు కూడా ప్లేయర్లను తమ కుటుంబంలోని సభ్యులుగా చూసుకుంటారు. అందుకే ప్రతీ ప్లేయర్ కోసం మాహీ కోసం, సీఎస్‌కే కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు...
 

ప్రతీ టీ20 గేమ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఫేస్ చేసేందుకు ధోనీ దగ్గర చాలా మార్గాలు సిద్ధంగా ఉంటాయి. ఆయన అనుభవంలో నుంచి ఒక్కో అస్త్రాన్ని సంధిస్తూ ఉంటాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ధోనీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ క్రికెటర్, సీఎస్‌కే ఓపెనర్ డివాన్ కాన్వే...
 

click me!