రోహిత్ ఫామ్‌లో ఎప్పుడు ఉన్నాడని! నాలుగేళ్లుగా అదే తంతు... టీమిండియా కెప్టెన్‌పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్...

First Published Jun 3, 2023, 3:10 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 టోర్నీ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది భారత జట్టు. ఈ ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఐపీఎల్ 2023 మెగా టోర్నీలో పాల్గొన్న భారత ప్లేయర్లు అందరూ చక్కగా రాణించారు, ఒక్క కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప...
 

Rohit Sharma

ఐపీఎల్ 2023 సీజన్‌లో శుబ్‌మన్ గిల్ 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిస్తే, విరాట్ కోహ్లీ 639, సూర్యకుమార్ యాదవ్ 602 పరుగులు చేశాడు. అజింకా రహానే ఎలాంటి అంచనాలు లేకుండా సీజన్‌ మొదలెట్టి, మెరుపులు మెరిపిస్తే... కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఛతేశ్వర్ పూజారా సెంచరీల మోత మోగించాడు..

Rohit Sharma

అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ 20.75 సగటుతో 332 పరుగులే చేశాడు. రోహిత్ శర్మ స్ట్రైయిక్ రేటు 132.80 మాత్రమే. ఇందులో వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, రెండే హాఫ్ సెంచరీలు చేశాడు...

PTI PhotoR Senthil Kumar)(PTI05_24_2023_000212B)

‘ఈ ఐపీఎల్‌ సంగతి పక్కనబెడితే గత ఐపీఎల్ సీజన్‌లో కూడా రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నట్టు కనిపించలేదు. వాస్తవానికి రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయి చాలా కాలమే అవుతోంది. అయితే టీమిండియాకి ఆడిన అతని బ్యాటు నుంచి మంచి పర్ఫామెన్స్ వచ్చింది...

Rohit Sharma

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ ఉన్న పొజిషన్‌లో అతనికి టెస్టులు చాలా కీలకం. విరాట్ కోహ్లీకి కూడా. ఈ వయసులో ఈ ఇద్దరూ టీ20ల్లో కుర్రాళ్లతో పోటీపడడం కరెక్ట్ కాదు...

Image credit: PTI

టెస్టుల్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ రోజురోజుకీ మెరుగవుతోంది. టెస్టుల్లో కూడా రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో ఒకే ఒక్క టెక్నికల్ లోపం కనబడుతోంది. అది అతను ఎక్కువగా పుల్ షాట్స్ ఆడి అవుట్ అవుతున్నాడు. రోహిత్ శర్మ లోపాన్ని కనిపెట్టిన ఆస్ట్రేలియా, కావాలని ఈ స్ట్రాటెజీని అప్లై చేస్తోంది..
 

Image credit: PTI

వన్డే క్రికెట్‌లో అతని పుల్ షాట్‌ ఆడే విధానం వేరే లెవెల్. అయితే వన్డేల్లో, టెస్టుల్లో ఒకేలా ఆడతానంటే కుదరదు. అందుకే రోహిత్ శర్మని ట్రాప్‌లో ఇరికించగలుగుతోంది ఆస్ట్రేలియా. ఈసారి రోహిత్ ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. 

click me!