ఇది కూడా పోయినట్టే! నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. - హర్భజన్ సింగ్...

Published : Jun 09, 2023, 04:49 PM IST

10 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది భారత జట్టు. అయినా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి ముందు టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి కారణం మనోళ్ల ఫామ్, రోహిత్ శర్మ కెప్టెన్సీ ట్రాక్ రికార్డు...  

PREV
17
ఇది కూడా పోయినట్టే! నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. - హర్భజన్ సింగ్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ అదరగొట్టారు. దీంతో ఈసారి మనోళ్లు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఏదేదో చేస్తారని బోలెడు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు...

27

కెప్టెన్‌గా ఐపీఎల్‌లో ఐదు సార్లు ఫైనల్ ఆడిన రోహిత్ శర్మ, టీమిండియా తాత్కాలిక సారథిగా ఆడిన మూడు ఫైనల్స్‌లోనూ ఓడిపోలేదు. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ రోహిత్ లక్ టీమ్‌కి కలిసి వస్తుందని అనుకున్నారు ఫ్యాన్స్...

37

అనుకున్నట్టే లక్కీగా టాస్ గెలిచిన రోహిత్ శర్మ, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌కి అనుకూలించే గ్రీన్ పిచ్‌పై భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ట్రావిస్ హెడ్ 163, స్టీవ్ స్మిత్ 121 పరుగులు చేసి సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగుల భారీ స్కోరు చేసింది..

47

‘వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ మనోళ్లు చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తోంది. మొదటి రెండు రోజుల్లో మనోళ్ల బౌలింగ్‌కి, ఆస్ట్రేలియా బౌలింగ్‌కి చాలా తేడా ఉంది..

57

ఈ పిచ్‌ ప్రకారం చూస్తే మన బౌలర్లు, ఆస్ట్రేలియాని తొలి 2 సెషన్లలోనే ఆలౌట్ చేయాలి. మనోళ్లు త్వరగా అవుటైనా ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడించడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే టీమిండియాని ఫాలో ఆన్ ఆడించి, చేతులు కాల్చుకున్న సందర్భాలు వాళ్లకు గుర్తుండే ఉంటాయి..

67

టీమిండియా ఎంత త్వరగా అవుటైనా వాళ్లు బ్యాటింగ్ చేస్తారు. నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది. స్టీవ్ స్మిత్ బిగ్ మ్యాచ్ ప్లేయర్. జట్టుకి అవసరమైనప్పుడు పరుగులు చేసేవాడే బెస్ట్ ప్లేయర్ అవుతాడు..

77

సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు కానీ ఆ వికెట్లు తీయడానికి చాలా ఆలస్యమైంది. తొలి ఇన్నింగ్స్‌లో వాళ్లు చాలా పరుగులు చేశారు.. చూస్తుంటే మనోళ్లు దీన్ని కూడా పోగొట్టినట్టే ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్..

click me!

Recommended Stories