ఈ ముగ్గురు ప్లేయర్లు నాలా ఆడగలరు, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతనే... - యువరాజ్ సింగ్..

First Published Jul 9, 2021, 11:50 AM IST

భారత జట్టు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పెద్దగా టెస్టులు ఆడలేకపోయినా వన్డే, టీ20ల్లో మాత్రం టీమిండియాకి అద్వితీయ విజయాలను అందించాడు... భారీ సిక్సర్లు బాదుతూ, బౌండరీల మోత మోగిస్తే ‘మ్యాచ్ విన్నర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు...

బ్యాటుతోనే కాకుండా బంతితోనూ పార్ట్ టైం బౌలర్‌గా జట్టుకి ఎన్నో విజయాలను అందించిన యువరాజ్ సింగ్, 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు...
undefined
యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత మిడిల్ ఓవర్లలో అతనిలా బ్యాటింగ్ చేయగలప్లేయర్‌ కోసం వెతుకుతూనే ఉంది టీమిండియా. అతని తన ప్లేస్‌ని భర్తీ చేయగల ముగ్గురి పేర్లను స్వయంగా ప్రకటించాడు యువీ...
undefined
‘మిడిల్ ఆర్డర్‌లో నాలా ఆడగల సత్తా ఉన్న లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్లను నేనైతే చూడలేదు. అయితే భారతజట్టులో కొందరు మంచి హిట్టర్లు ఉన్నారు...
undefined
రిషబ్ పంత్ బాగా ఆడుతున్నాడు. హార్ధిక్ పాండ్యా బాగా ఆడగలడు. రిషబ్ పంత్- హార్ధిక్ పాండ్యా కలిసి వన్డే, టీ20 మ్యాచులు ఎక్కువగా ఆడితే... ఈ ఇద్దరూ భారత జట్టుకి మ్యాచ్ విన్నింగ్ జోడీ కాగలదు...
undefined
రవీంద్ర జడేజా కూడా చాలా టాలెంటెడ్ ప్లేయర్ల. ఈ ముగ్గురూ మ్యాచ్‌ను ఏ టైంలో అయినా మలుపుతిప్పగలరు.. ఇప్పటికే జడేజా వన్డే, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు...
undefined
అయితే ఓ లెఫ్ట్ హ్యాండ్- ఓ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కాంబినేషన్ కుదిరితే... బౌలర్లకు చెమటలు పట్టించొచ్చు... నేను, ధోనీ కలిసి చేసింది అదే... ఇప్పుడున్న జట్టులోనూ అలాంటి ప్లేయర్లు ఉన్నారు...
undefined
రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా... బ్యాటింగ్ ఆర్డర్‌లో 5,6,7 స్థానాల్లో ఆడితే బాగుంటుంది... ఇప్పటికే వీళ్లు నిరూపించుకున్నారు. కానీ మ్యాచ్ విన్నర్లుగా మారాల్సిన అవసరం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్...
undefined
‘రిషబ్ పంత్, చాలా స్మార్ట్ క్రికెటర్. అతను ఆడమ్ గిల్‌క్రిస్ట్ లాంటోడు. ఏ సమయంలో అయినా గేమ్‌ను ఛేంజ్ చేసేయగలడు. టెస్టు క్రికెట్‌లో గిల్లీ గేమ్ ఛేంజర్‌గా ఉండేవాడు. పంత్ కూడా అతనిలా అద్భుతంగా రాణించగలడు...
undefined
నాకు రిషబ్ పంత్‌ భావి కెప్టెన్‌లా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతనిలో దూకుడు ఉంది, వ్యూహాలు రచించగల సామర్థ్యం కూడా ఉంది... అన్నింటికీ ముఖ్యంగా అతను వికెట్ల వెనకాల కామెంటరీతో జట్టులో ఉత్సాహం నింపుతాడు...
undefined
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పుడు రిషబ్ పంత్‌ను చాలా గమనించా. అతను అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. కాబట్టి భవిష్యత్తులో కెప్టెన్సీ పోటీదారుడిగా రిషబ్ పంత్ ఉంటాడు’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్...
undefined
click me!