వరల్ట్ నెం.1 టీ20 బ్యాట్స్‌వుమెన్ షెఫాలీ వర్మ, టెన్త్ పాస్ అయ్యింది... ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో...

First Published Jul 9, 2021, 11:10 AM IST

17 ఏళ్ల యంగ్ సెన్సేషనల్ వుమెన్ క్రికెటర్ షెఫాలీ వర్మ, టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది. హర్యనాకు చెందిన షెఫాలీ వర్మ, 15 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి, అదరగొడుతోంది. తక్కువ టైంలోనే వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో ఓపెనర్‌గా మారిన షెఫాలీ వర్మ, చదువులోనూ సత్తా చాటింది...

క్రికెట్‌ బిజీ షెడ్యూల్ కారణంగా హర్యానాలో ఓపెన్ స్కూల్‌ పద్ధతిలో టెన్త్ పరీక్షలు రాసింది షెఫాలీ వర్మ. తాజాగా ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి...
undefined
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్న షెఫాలీ వర్మకి పదో తరగతి ఫలితాల్లో 52 శాతం మార్కులు వచ్చాయి. షెఫాలీ వర్మను హర్యాని టెన్త్ బోర్డు ఛైర్మెన్ అభినందించారు...
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆరంగ్రేటం చేసిన షెఫాలీ వర్మ, ఐసీసీ వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ నామినేషన్‌లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులు చేసి ఆకట్టుకుంది...
undefined
ఆరంగ్రేటం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన షెఫాలీ వర్మ, వన్డే సిరీస్‌లోనూ ఆకట్టుకుని... ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచింది.
undefined
షెఫాలీ వర్మతో పాటు టెస్టు మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కి నామినేట్ అయ్యింది...టెస్టు మ్యాచ్‌లో 154 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచిన స్నేహ్ రాణా, నాలుగు వికెట్లు కూడా తీసింది...
undefined
పురుషుల క్రికెట్‌లో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న న్యూజిలాండ్ ఓపెనర్ డివాన్ కాన్వేతో పాటు ఏడు వికెట్లు తీసిన కేల్ జెమ్మీసన్... ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో నిలిచారు...
undefined
వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఒంటరి పోరాటం చేసిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచాడు...
undefined
click me!