మరో నాలుగు రోజుల్లో సిరీస్, ఇంతలో లంక బ్యాటింగ్ కోచ్‌కి పాజిటివ్... ఇండియా- శ్రీలంక సిరీస్‌పై...

First Published Jul 9, 2021, 11:32 AM IST

మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియా, శ్రీలంక సిరీస్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ సిరీస్ ఆరంభానికి ముందు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, లంకలో భారత జట్టు సిరీస్ పూర్తిచేయడం కష్టమేనని అనిపిస్తోంది...

శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంగ్లాండ్‌లో వన్డే, టీ20 సిరీస్‌ కోల్పోయిన శ్రీలంక జట్టు, స్వదేశం చేరుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కి పాజిటివ్ వచ్చింది...
undefined
కోచ్‌ని ఐసోలేషన్‌కి తరలించిన శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆటగాళ్లను కూడా ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కి పంపించింది. శ్రీలంక గత సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా ఏడు పాజిటివ్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
undefined
వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బెయిర్ స్టో, పుకోవిస్కీతో పాటు మరో నలుగురు సహాయక సిబ్బందికి పాజిటివ్ రావడంతో హుటాహుటీన కొత్త టీమ్‌ను ఎంపిక చేసి... పాక్‌తో సిరీస్ ఆడిస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...
undefined
ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడి వచ్చిన శ్రీలంక జట్టులో కూడా పాజిటివ్ కేసు నమోదుకావడంతో భారత ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. బ్యాటింగ్ కోచ్‌కి పాజిటివ్ రావడంతో జట్టులో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
undefined
అదే జరిగితే ఇంగ్లాండ్‌లా ఈ టీమ్‌ని పక్కనబెట్టి ఫ్రెష్ టీమ్‌తో ఇండియా సిరీస్ ఆడించాల్సి ఉంటుంది. అయితే లంక దగ్గర అంత సౌకర్యం లేదు.
undefined
ఇప్పటికే వరుస పరాజయాలతో తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్న లంక జట్టుకి, భారత్‌తో సిరీస్ కీలకం కానుంది... కొత్త జట్టును ఎంపిక చేయలేరు కాబట్టి, లంక టీమ్‌లో పాజిటివ్ కేసులు వస్తే ఇండియా- లంక సిరీస్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది.
undefined
పర్ఫామెన్స్ గురించి పక్కనబెడితే, టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్ ద్వారా లంక క్రికెట్ బోర్డుకి కాసుల వర్షం కురవబోతోందని స్వయంగా వాళ్లే ప్రకటించారు... ఈ సమయంలో వరుసగా అపశకునాలు ఎదురవుతున్నాయని బోర్డు అధికారులు ఫీల్ అవుతున్నారు...
undefined
భారత్, శ్రీలంక సిరీస్ ద్వారా దాదాపు రూ.89 కోట్ల దాకా ఆదాయం ఆర్జించబోతోంది లంక క్రికెట్ బోర్డు. ఒకవేళ లంక జట్టులో పాజిటివ్ కేసులు ఎక్కువైతే, ఈ సిరీస్ అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంది...
undefined
ఇప్పటికే జాతీయ కాంట్రాక్ట్ ఒప్పందాల విషయంలో లంక ప్లేయర్లతో విభేదాలు, ఇంగ్లాండ్‌లో ముగ్గురుప్లేయర్లు కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘించి దొరికిపోయి, నిషేధానికి గురవ్వడం, ఆ తర్వాత ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపాలతో ఇండియాలో ల్యాండ్ అవ్వడం, ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టులో పాజిటివ్ కేసులు, ఇప్పుడు స్వయంగా బ్యాటింగ్ కోచ్‌కి పాజిటివ్ రావడం... ఇండియాతో సిరీస్ ఆరంభానికి ముందు లంక జట్టుకు ఎదురవుతున్న అనుభవాలు ఇవి...
undefined
click me!