వాళ్లు ఐపీఎల్ 2021లో ఫెయిల్ అయితే... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు భారత జట్టులో మార్పులు...

First Published Sep 9, 2021, 11:59 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి 15 మంది ప్లేయర్లు, ముగ్గురు స్టాండ్ బై ప్లేయర్లతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ జట్టులో కొన్ని సర్‌ప్రైజ్‌‌లు ఉంటే, మరికొందరు ప్లేయర్లకు చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇది ఫైనల్ మాత్రం కాదు...

అవును, కరోనా ప్రోటోకాల్‌లో భాగంగా టీ20 వరల్డ్‌కప్ 2021 ఆరంభానికి ముందు ప్రతీ జట్లూ 10 రోజుల పాటు యూఏఈలో క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది...

అక్టోబర్ 10న ప్రారంభమయ్యే ఈ క్వారంటైన్ పీరియడ్ ముగిసేలోపు జట్టులో అవసరమైన మార్పులు చేసుకునేందుకు అన్ని దేశాలకు అనుమతులు ఇచ్చింది ఐసీసీ...

ఈ వెసులుబాటు కారణంగా యూఏఈలోనే జరిగే ఐపీఎల్ 2021 ఫేజ్ 2 సీజన్‌ పర్ఫామెన్స్ ఆధారంగా, టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో కొన్ని మార్పులు, చేర్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

ముఖ్యంగా యజ్వేంద్ర చాహాల్‌కి ఐపీఎల్ 2021 ఫేజ్ 2 పర్ఫామెన్స్ చాలా కీలకం కానుంది. ఆర్‌సీబీ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో ప్లేస్ దక్కలేదు... 

టీమిండియా తరుపున 49 టీ20 మ్యాచులు ఆడిన యజ్వేంద్ర చాహాల్, ఫేజ్2 ఐపీఎల్‌లో అదరగొడితే, అతనికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

అయితే చాహాల్, టీ20 వరల్డ్‌కప్‌‌లో చోటు దక్కించుకోవాలంటే అతను అద్భుతంగా రాణించడంతో పాటు వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్‌లలో ఒకరు దారుణంగా ఫెయిల్ కావాల్సి ఉంటుంది...

ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో 7 మ్యాచులు ఆడిన యజ్వేంద్ర చాహాల్, 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అదీకాకుండా గత సీజన్‌లో చాహాల్ ఎకానమీ 7.08 కాగా, ఈసారి అది 8.26కి పెరిగింది...

లక్కీగా టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులోకి వచ్చిన కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఐపీఎల్ ఫేజ్1లో 7 మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా (7.82) చాహాల్ కంటే మెరుగ్గా ఉంది...

యూఏఈలో జరిగే ఐపీఎల్ ఫేజ్ 2లో యజ్వేంద్ర చాహాల్ మ్యాజిక్ చేసి, వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయితే... టీ20 వరల్డ్‌కప్ జట్టులో వరుణ్ ప్లేస్‌లో చాహాల్ రావడం గ్యారెంటీ...

అలాగే ఇషాన్ కిషన్ ఫెయిల్ అయ్యి, శిఖర్ ధావన్ ఇరగదీసే పర్ఫామెన్స్ ఇస్తే... గబ్బర్‌ని టీ20 వరల్డ్‌కప్‌లో చేర్చేందుకు కూడా ప్రయత్నాలు చేయొచ్చు సెలక్టర్లు...

వీరితో పాటు దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్ల పర్ఫామెన్స్ కూడా వారిని స్టాండ్ బై ప్లేయర్ల కోటా నుంచి తుదిజట్టులో చేర్చేందుకు మార్గాలు సుగమం చేస్తాయి...

click me!