అందుకే అశ్విన్‌ని అలా దాచిపెట్టాడా... టీ20 వరల్డ్‌కప్‌కి ముందు విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్...

Published : Sep 09, 2021, 11:32 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. 2017 తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడని రవి అశ్విన్, నాలుగేళ్ల తర్వాత అదీ టీ20 వరల్డ్‌కప్ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేదు...

PREV
110
అందుకే అశ్విన్‌ని అలా దాచిపెట్టాడా... టీ20 వరల్డ్‌కప్‌కి ముందు విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్...

టీమిండియా తరుపున 111 వన్డేలు, 46 టీ20 మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్- కుల్దీప్ యాదవ్ జోడీ ఆరంగ్రేటం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కి దూరమయ్యాడు..

2017 జూన్‌లో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన అశ్విన్, 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

210

అశ్విన్ టెస్టులకు మాత్రమే పరిమితమైతే, యజ్వేంద్ర చాహాల్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు ప్రధాన స్పిన్నర్‌గా ఉండేవాడు... అయితే అన్యూహ్యంగా టీ20 వరల్డ్‌కప్‌కి అశ్విన్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు...

310

అయితే రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక విషయం ముందే తెలిసిన భారత సారథి విరాట్ కోహ్లీ... కావాలనే, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతన్ని మొదటి నాలుగు టెస్టులకు దూరంగా పెట్టాడని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

410

చాలా రోజుల ముందే టీ20ల్లో టాప్‌లో ఉన్న ఇంగ్లాండ్‌, టీ20 వరల్డ్‌కప్ ఫెవరెట్ టీమ్ అంటూ వ్యాఖ్యనించాడు విరాట్ కోహ్లీ... 

510

టెస్టు సిరీస్‌లో కూడా జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, మార్క్ వుడ్, సామ్ కుర్రాన్ వంటి ఇంగ్లాండ్ ప్లేయర్లు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడతారు...

610

టెస్టు సిరీస్‌లో అశ్విన్ బరిలో దిగి ఉంటే, వీరితో పాటు ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా అశ్విన్‌ స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని స్టడీ చేసేందుకు అవకాశం దొరికేది...

710

అందుకే టీ20 వరల్డ్‌కప్‌కి ముందు విరాట్ కోహ్లీ మాస్టర్ మైండ్‌తో ఆలోచించి, ఇంగ్లాండ్ జట్టుకి ఆ అవకాశం లేకుండా చేశాడు. ఇప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్‌గా వచ్చిన అశ్విన్‌ను, వారిపై స్పిన్ అస్త్రంగా సంధించాలనుకుంటున్నాడు విరాట్ కోహ్లీ...

810

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపికవ్వడంపై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు రవిచంద్రన్ అశ్విన్... 2017లో ఈ కోటేషన్‌ను నేను నా డైరీలో కొన్ని వందల సార్లు రాసుకొని ఉంటాను, ఇప్పుడీ గోడపై రాశాను...

910

కొన్ని కొటేషన్లు చదవడానికి, మరికొన్ని వాటి నుంచి ప్రేరణ పొంది, మన జీవితంలో అనుసరించడానికి పనికొస్తాయి. ఆనందం, ఇంకా కృతజ్ఞతలు... ప్రస్తుతం నా మనసులో ఉన్న భావనలు ఈ రెండే...’ అంటూ రాసుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

1010

‘ప్రతీ టన్నెల్ చివరలో ఓ వెలుగు ఉంటుంది. కానీ టన్నెల్‌లో ఉన్నవాళ్లు మాత్రం ఆ వెలుగును చూడడానికే బతుకుతూ ఉంటారు...’ అంటూ ఓ కొటేషన్‌ను రాసుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

click me!

Recommended Stories