BBL నుంచి ఐపీఎల్‌కి... ఈ ఐదుగురు బిగ్‌బాష్ లీగ్ స్టార్లపై ఐపీఎల్ ఫ్రాంఛైజీల కన్ను...

First Published Jan 5, 2021, 12:36 PM IST

సాధారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీగా ధర చెల్లించడానికి రెఢీగా ఉంటాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు. 2020 ఐపీఎల్ వేలంలో ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం కోట్లకు కోట్లు కుమ్మరించడానికి రెఢీ అయిపోయాయి ఫ్రాంఛైజీలు. కోట్లు కొల్లగొట్టుకున్న ఈ ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు, ఐపీఎల్‌లో పెద్దగా ప్రదర్శన ఇవ్వలేకపోయారు. అయితే ఈ సారి కూడా ఆసీస్ ప్లేయర్లకు భారీ ధర పలికే అవకాశం ఉంది.

బిగ్‌బాష్ లీగ్ 2020 సీజన్‌లో ఆస్ట్రేలియా యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు... బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అదరగొడుతూ ఐపీఎల్ ఫ్రాంఛైజీలను ఆకర్షిస్తున్నారు...
undefined
ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా బీబీఎల్‌లో అదరగొడుతున్న ఐదుగురు యువ క్రికెటర్ల కోసం ఐపీఎల్ వేలం 2021లో ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం కనిపిస్తోంది...
undefined
రిలే మెరెడిత్: 24 ఏళ్ల తస్మానియా పేసర్ రిలే మెరెనిత్... 140 కి.మీ.ల వేగంతో బంతులను సంధించగలడు. 29 మ్యాచుల్లో 39 వికెట్లు తీసిన మెరెడిత్ ఉత్తమ ప్రదర్శన 421...
undefined
తన్వీర్ సంగా: 19 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా స్పిన్నర్... తన స్పిన్ మాయాజాలంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆరు మ్యాచుల్లో 15 వికెట్లు తీసిన తన్వీర్ కోసం ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలు పోటీపడడం గ్యారెంటీ...
undefined
జే రిచర్డ్‌సన్: ఆస్ట్రేలియా పేసర్ ఇప్పటిదాకా 50 డొమెస్టిక్ మ్యాచులు ఆడాడు. 58 వికెట్లు తీసిన రిచర్డ్‌సన్, సగటున ప్రతీ మూడు ఓవర్లకు ఓ వికెట్ తీశాడు.
undefined
అలెక్స్ హేల్స్: ఈ ఇంగ్లీష్ ఓపెనర్ 2019 సీజన్‌లో క్రమశిక్షణారహిత్యం కారణంగా బీబీఎల్‌కి దూరమయ్యాడు. ఇప్పటిదాకా 277 టీ20 మ్యాచులు ఆడిన హేల్స్... 143.87 స్ట్రైయిక్ రేటుతో 7581 పరుగులు చేశాడు...
undefined
డేవిడ్ మలాన్: టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు డేవిడ్ మలాన్. గత రెండేళ్లు టీ20 క్రికెట్‌లో విధ్వంసం సృష్టిస్తున్న మలాన్ కోసం ఐపీఎల్ జట్లు పోటీపడడం ఖాయం...
undefined
216 టీ20 మ్యాచుల్లో 5981 పరుగులు చేసిన మలాన్, 130 స్ట్రైయిక్ రేటుతో పరుగుతు చేస్తున్నాడు. మలాన్ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికే క్రికెటర్‌గా నిలిచే అవకాశం ఉంది.
undefined
click me!