టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ట్రిపుల్ సెంచరీలు చేసిన టాప్-5 ఆట‌గాళ్లు వీరే

First Published | Sep 18, 2024, 1:20 PM IST

most triple centuries in Test cricket : టెస్టు క్రికెట్ లో రికార్డుల మోత మోగించిన చాలా మంది ప్లేయ‌ర్ల ఉన్నారు. కానీ, ట్రిపుల్ సెంచ‌రీలు సాధించిన క్రికెట‌ర్లు చాలా త‌క్కువ మంది ఉన్నారు. టెస్టు క్రికెట్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌తో అత్య‌ధిక ట్రిపుల్ సెంచ‌రీలు సాధించిన టాప్-5 ప్లేయ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 
 

most triple centuries in Test cricket top-5 players

most triple centuries in Test cricket : టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల లిస్టులో టీమిండియా లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అయితే, ఈ ఫార్మాట్ లో ట్రిఫులు సెంచ‌రీ అత‌నికి సాధ్యం  కాలేదు. టెస్టు క్రికెట్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు ట్రిపుల్ సెంచరీ చేయడం అంత తేలికైన విషయం కాదు. టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాలంటే బ్యాట్స్‌మెన్‌కు ఓర్పు, టెక్నిక్ అవసరం. అయితే, టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా ట్రిపుల్ సెంచరీలు చేసిన టాప్-5 భయంకరమైన బ్యాట‌ర్ల లిస్టులో భార‌త జ‌ట్టు నుంచి ఇద్ద‌రు ప్లేయ‌ర్ ఉన్నారు. 

most triple centuries in Test cricket top-5 players

1. డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా)

గ్రేట్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ టెస్ట్ క్రికెట్‌లో 2 ట్రిపుల్ సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. బ్రాడ్‌మాన్ ఇంగ్లండ్‌పై ఈ రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. డాన్ బ్రాడ్‌మాన్ 52 టెస్ట్ మ్యాచ్‌లలో 99.94 సగటుతో 6996 పరుగులు చేశాడు. 

ఇందులో అతని అత్యుత్తమ స్కోరు 334 పరుగులు. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యధిక స‌గ‌టు క‌లిగిన ఏకైక ప్లేయ‌ర్ డాన్ బ్రాడ్ మాన్. 90కి పైగా స‌గ‌టు ఇత‌ని త‌ర్వాత ఏ క్రికెట‌ర్ కు లేదు. డాన్ బ్రాడ్‌మాన్ 1928 నుండి 1948 వరకు ఆస్ట్రేలియా తరపున 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, భారతదేశంపై 80 సార్లు బ్యాటింగ్ చేసి 99.94 సగటుతో 6996 పరుగులు చేశాడు. బ్రాడ్‌మాన్ 29 టెస్టు సెంచరీలు చేశాడు. 


most triple centuries in Test cricket top-5 players

2. వీరేంద్ర సెహ్వాగ్ (భారత్)

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో 2 ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. సెహ్వాగ్ పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీ, దక్షిణాఫ్రికాపై రెండో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 104 టెస్ట్ మ్యాచ్‌లలో 49.34 సగటుతో 8586 పరుగులు చేశాడు, ఇందులో అతని అత్యుత్తమ స్కోరు 319 పరుగులు.

భార‌త జ‌ట్టులోనే కాకుండా ప్ర‌పంచ క్రికెట్ లో ఢాషింగ్ ఓపెన‌ర్ గా గుర్తింపు పొందాడు. తన కెరీర్‌లో సెహ్వాగ్ ఎన్నో అద్భుత‌మైన విజయాలు సాధించాడు. రెండు ట్రిపుల్ సెంచరీలతో పాటు, అతను టెస్ట్ క్రికెట్‌లో 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

most triple centuries in Test cricket top-5 players

3. క్రిస్ గేల్ (వెస్టిండీస్)

యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ ప్ర‌పంచ క్రికెట్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌కు పెట్టింది పేరు. టీ20, వ‌న్డే, టెస్టు క్రికెట్.. ఫార్మాట్ ఏదైన సునామీ ఇన్నింగ్స్ ల‌తో గుర్తింపు పొందాడు. అంత‌ర్జాతీ క్రికెట్ లో అద్భుత‌మైన ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. 

వెస్టిండీస్ దిగ్గజ ఓపెనర్ క్రిస్ గేల్ కూడా టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంకలపై క్రిస్ గేల్ ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. క్రిస్ గేల్ 103 టెస్ట్ మ్యాచ్‌లలో 42.18 సగటుతో 7214 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోరు 333 పరుగులు.

most triple centuries in Test cricket top-5 players

4. బ్రియాన్ లారా (వెస్టిండీస్)

గ్రేట్ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా కూడా టెస్ట్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. ఈ రెండు ట్రిపుల్ సెంచరీలు ఇంగ్లండ్‌పైనే నమోదయ్యాయి. ఈ ఇన్నింగ్స్‌ల్లో అజేయంగా 400 పరుగులు చేయడం ప్రపంచ రికార్డు.

టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో నాలుగు వంద‌ల ప‌రుగుల వ్య‌క్తిగ‌త ఇన్నింగ్స్ స్కోర్ చేసిన ఒకే ఒక్క‌డు.  బ్రియాన్ లారా 131 టెస్ట్ మ్యాచ్‌లలో 52.88 సగటుతో 11953 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోరు 400 నాటౌట్.

most triple centuries in Test cricket top-5 players

5. కరుణ్ నాయర్ (భారతదేశం)

భారత బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ కూడా టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌పై కరుణ్ నాయర్ ఈ ఘనత సాధించాడు. కరుణ్ నాయర్ 6 టెస్టు మ్యాచ్‌ల్లో 62.33 సగటుతో 374 పరుగులు చేశాడు. 

ఇందులో అతని అత్యుత్తమ స్కోరు 303 నాటౌట్.  వీరు మాత్ర‌మే కాకుండా టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచంలోని 23 మంది బ్యాట్స్‌మెన్ ట్రిపుల్ సెంచరీ సాధించారు. 

Latest Videos

click me!