టీమిండియాలో ఒకరికి ఐదుగురు కెప్టెన్లు ఉన్నారు... ఆసీస్ దిగ్గజం బ్రెట్ లీ...

First Published Jan 27, 2022, 4:46 PM IST

టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో తర్వాతి సారథి ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొందరు రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు అప్పగించవచ్చని అంటుంటే, మరికొందరు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, అశ్విన్‌ల పేర్లు వినిపిస్తున్నారు...

లేటు వయసులో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ, టెస్టు ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరిస్తే, ‘హిట్ మ్యాన్’కే టెస్టు కెప్టెన్సీ దక్కొచ్చు...

అయితే ఈ వయసులో టీ20, వన్డేలతో పాటు టెస్టుల్లో జట్టును నడిపించడమంటే వయసుకి మించిన భారంగా రోహిత్ భావించవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా...

కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారనుకున్నా, సౌతాఫ్రికాలో అతని కెప్టెన్సీ ప్రావీణ్యం ఏంటో అందరికీ స్పష్టంగా అర్థమైంది...

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించిన రిషబ్ పంత్, పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేసిన రవిచంద్రన్ అశ్విన్ కూడా టీమిండియా కెప్టెన్సీ రేసులో ఉన్నారు...

‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకోవడం పూర్తిగా విరాట్ కోహ్లీ ఇష్టం. యాషెస్ సిరీస్, బిగ్‌బాష్ లీగ్ కారణంగా బయట ఏం జరుగుతుందో పెద్దగా గమనించలేకపోయాను...

అయినా టీమిండియాలో ఒకటికి నాలుగు- ఐదుగురు కెప్టెన్లు ఉన్నారు. జట్టును నడిపించగల సత్తా చాలామందిలో ఉంది...

ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్, వారిలో ది బెస్ట్ అనుకున్న ఒక్క ప్లేయర్‌ను ఎంచుకని, కెప్టెన్సీ ఇస్తే సరిపోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ...

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం రోహిత్ శర్మకి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు... 

‘మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తే బెటర్. ఒకవేళ రోహిత్, టెస్టు కెప్టెన్సీ తీసుకోవడానికి ఇష్టపడకపోతే జస్ప్రిత్ బుమ్రాకి ఆ బాధ్యత అప్పగించాలి...’ అంటూ కామెంట్ చేశాడు భజ్జీ...

click me!