విరాట్ కోహ్లి కాదు.. అతడే నా ఫేవరేట్ కెప్టెన్.. గతేడాది పర్పుల్ క్యాప్ హీరో హర్షల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు

First Published Jan 27, 2022, 2:07 PM IST

Harshal Patel: గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన హర్షల్ పటేల్.. 15 మ్యాచులలో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం... 
 

Harshal Patel

ఐపీఎల్ లో గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించడంలో కీలక పాత్ర పోషించాడు హర్షల్ పటేల్.  లేటు వయసులో టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన  ఈ గుజరాత్ బౌలర్.. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడి  లీగ్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఘనత సాధించాడు.
 

గతేడాది ఐపీఎల్ లో 32 వికెట్లు తీసి  పర్పుల్ క్యాప్ దక్కించుకున్న హర్షల్ పటేల్.. విరాట్ కోహ్లి సారథ్యంలో మెరిసినా అతడు మాత్రం తనకు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని అంటే  చాలా ఇష్టమని చెప్పాడు.
 

హర్షల్  మాట్లాడుతూ... తనకు వచ్చే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలని ఉందని తెలిపాడు.  ఎంఎస్ ధోని అంటే తనకు చాలా ఇష్టమని, అతడి కెప్టెన్సీ లో ఆడటం తన కల అని తెలిపాడు.  కోహ్లి సారథ్యం కింద ఆడి పేరు గడించినా.. తన ఆల్ టైం బెస్ట్ కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్నకు  పటేల్ మాత్రం.. ధోని అనే సమాధానం ఇవ్వడం గమనార్హం. 
 

ఇక రిటెన్షన్ ప్రక్రియలో ఆర్సీబీ తనను తీసుకోకపోవడంపై   స్పందిస్తూ.. ‘మైక్ హెసెన్ (ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్) నాకు కాల్ చేశాడు. ఇది (రిటెన్షన్ ప్రక్రియ) అంతా  పర్స్ మేనేజ్మెంట్ అని చెప్పాడు. వాళ్లు (ఆర్సీబీ) నన్ను తిరిగి (2022 వేలం) దక్కించుకుంటామని చెప్పారు.  నేను కూడా ఆ జట్టు తరఫున ఆడటానికి ఇష్టపడతాను. 
 

ఎందుకంటే ఆర్సీబీ, 2021 ఐపీఎల్ సీజన్ నా జీవితాన్ని మార్చేశాయి.  అయితే వేలానికి ముందు నన్ను ఏ ఫ్రాంచైజీ సంప్రదించలేదు..’ అని వెల్లడించాడు. 
 

గతేడాది రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా హర్షల్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు.  దీంతో అతడు వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఫిబ్రవరి  12, 13 లలో  బెంగళూరు వేదికగా జరిగే మెగా వేలంలో  తన కనీస ధర (బేస్ ప్రైస్)ను రూ. 2 కోట్లుగా నిర్ణయించాడు. ఇదే హర్షల్ ను 2021 లో ఆర్సీబీ  రూ. 20 లక్షలకే కొనుగోలు చేసింది. 
 

గత ఐపీఎల్ సీజన్ లో 15 మ్యాచులాడిన హర్షల్ 32 వికెట్లు తీశాడు. ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో హర్షల్.. రబాడతో కలిసి నెంబర్ వన్ స్థానాన్ని కలిగిఉన్నాడు.  గత సీజన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన లీగ్ మ్యాచులో హర్షల్.. హ్యట్రిక్ కూడా సాధించాడు. 

ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతడు గతేడాది  నవంబర్ లో   న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన  టీ20 సిరీస్ లో స్థానం దక్కించుకున్నాడు.  ఆ సిరీస్ లో రెండు మ్యాచులే ఆడినా  రాణించాడు.  ఇక తాజాగా అతడు వెస్టిండీస్ తో జరిగే టీ 20 సిరీస్ కు కూడా ఎంపికయ్యాడు. 
 

click me!