ఐపీఎల్ ఆడితేనే, టీమిండియాకి ఎంపిక చేస్తారా? జట్టులో రిషి ధావన్ పేరు లేకపోవడంపై...

First Published Jan 27, 2022, 4:03 PM IST

ఒకప్పుడు దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో పర్పామెన్స్ ఆధారంగా టీమిండియాకి ప్లేయర్లను ఎంపిక చేసేవాళ్లు సెలక్టర్లు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఐపీఎల్ పర్పామెన్స్‌ను ఆధారంగా చేసుకుని జట్టు సెలక్షన్ జరుగుతోంది...

ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌లో ఆడితే వచ్చే క్రేజ్, గుర్తింపు... దేశవాళీ టోర్నీల్లో ఎన్ని మ్యాచులు ఆడినా రాదు. సగం సీజన్‌లో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్, అలాగే టీమిండియాలోకి దూసుకొచ్చాడు...

దేశవాళీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రిషి ధావన్‌ని మాత్రం సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు...

సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో అదరగొట్టిన రిషి ధావన్, విజయ్ హాజారే ట్రోఫీ గెలిచి హిమాచల్ ప్రదేశ్ జట్టుకి కెప్టెన్‌గా మొట్టమొదటి దేశవాళీ టోర్నీ అందించాడు...

పటిష్టమైన తమిళనాడు జట్టును హిమాచల్ ప్రదేశ్ ఫైనల్‌లో ఓడిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే రిషి ధావన్ కెప్టెన్సీతో బౌలింగ్‌లో 3 వికెట్లు, బ్యాటింగ్‌లో 42 పరుగులు చేసి చరిత్ సృష్టించాడు.

1990 ఫిబ్రవరి 19న హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఏరియాలో జన్మించిన రిషి ధావన్, దేశవాళీ టోర్నీల్లో పర్పామెన్స్ కారణంగా టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసి ఇప్పటికే మూడు వన్డే మ్యాచులు, ఓ టీ20 కూడా ఆడాడు...


2008 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు ధావన్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2013లో రిషి ధావన్, ముంబై ఇండియన్స్ తరుపున కూడా ఆడాడు...

2014 ఐపీఎల్ వేలంలో రిషి ధావన్‌ను ఏకంగా రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. 2017 వేలంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు రూ.55 లక్షలకు సొంతం చేసుకుంది...

అయితే ఐపీఎల్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన రిషీ ధావన్, ఈ ఏడాది దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా అదరగొడుతున్నాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ఆల్‌రౌండ్ పర్పామెన్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకర్షించాడు ధావన్...

విజయ్ హాజారే ట్రోఫీలో 7 మ్యాచుల్లో 69.33 సగటుతో 416 పరుగులు చేశాడు రిషీ ధావన్. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్‌లో 5.95 ఎకానమీతో బౌలింగ్ చేసి 14 వికెట్లు తీశాడు ధావన్...

అంతకుముందు సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో 117 పరుగులు చేసి, 14 వికెట్లు తీసిన రిషి ధావన్‌కి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అవకాశం వస్తుందని భావించారు అభిమానులు. అయితే అప్పుడు నిరాశే ఎదురైంది...

కనీసం వెస్టిండీస్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లో అయినా రిషి ధావన్‌కి అవకాశం వస్తుందని ఆశించారు. అయితే ఇప్పుడు కూడా నిరాశే ఎదురైంది...

టీమిండియా ప్రస్తుతం సరైన పేస్ ఆల్‌రౌండర్ కోసం వెతుకుతోంది. హార్ధిక్ పాండ్యా గాయపడడంతో వెంకటేశ్ అయ్యర్‌ను ప్రయత్నించారు. అయితే ఇప్పటిదాకా అతను సరిగా ఆడలేకపోయాడు...

సౌతాఫ్రికా టూర్‌లో వన్డేల్లో ఫెయిల్ కావడంతో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కి వెంకటేశ్ అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. అయ్యర్‌కి బదులుగా దీపక్ హుడాకి చోటు దక్కింది...

అయితే మంచి ఫామ్‌లో ఉన్న రిషి ధావన్‌ను మాత్రం పక్కనబెట్టేశారు సెలక్టర్లు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను తుదిజట్టులోకి ఎంపిక చేసిన టీమిండియా, రిషి ధావన్ లాంటి ప్లేయర్‌ను అసలు పరిగణనలోకి తీసుకోకపోడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

click me!