అప్పుడు రోహిత్ శర్మ వేసిన ట్వీట్‌ని కాపీ చేసిన యజ్వేంద్ర చాహాల్... సేమ్ రిజల్ట్ రిపీట్ కాదుగా..

Published : Aug 22, 2023, 10:30 AM IST

రవిచంద్రన్ అశ్విన్ టెస్టులకు పరిమితమైన తర్వాత టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వచ్చాడు యజ్వేంద్ర చాహాల్. అయితే గత రెండు ఐసీసీ టోర్నీల్లోనూ యజ్వేంద్ర చాహాల్‌‌కి చోటు దక్కలేదు. తాజాగా ఆసియా కప్ 2023 జట్టులోనూ చాహాల్‌ పేరు మిస్ అయ్యింది..

PREV
18
అప్పుడు రోహిత్ శర్మ వేసిన ట్వీట్‌ని కాపీ చేసిన యజ్వేంద్ర చాహాల్... సేమ్ రిజల్ట్ రిపీట్ కాదుగా..

స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు కల్పించిన సెలక్టర్లు, స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేశారు. ఆసియా కప్ జట్టునే వరల్డ్ కప్‌లోనూ కంటిన్యూ చేస్తే, యజ్వేంద్ర చాహాల్ వరుసగా మూడో ఐసీసీ టోర్నీలో చోటు కోల్పోతాడు..
 

28

‘8, 9వ స్థానాల్లో బ్యాటింగ్ చేయగల స్పిన్నర్లు కావాలి. అక్షర్ పటేల్ అన్ని ఫార్మాట్లలో, ఐపీఎల్ కూడా బ్యాటుతో అద్భుతంగా రాణించాడు. వెస్టిండీస్ టూర్‌లోనూ అతనికి కొన్ని ఛాన్సులు దక్కాయి. అయితే అతను లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు..

38

అక్షర్ పటేల్ జట్టులో ఉంటే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అదీకాకుండా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా ఉన్నట్టు ఉంటుంది. అవసరమైతే స్పిన్నర్లను ఎదుర్కొవడానికి టాపార్డర్‌లోనూ అతన్ని వాడుకోవచ్చు.. మేం అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నాం...

48
Yuzvendra Chahal Kudeep Yadav

అయితే వారిని తీసుకుంటే ఫాస్ట్ బౌలర్లను తగ్గించాల్సి ఉంటుంది. ఎంత ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ అయినంత మాత్రాన పూర్తి స్పిన్నర్లతో ఆడలేం కదా. అయితే వరల్డ్ కప్‌లో ఆడేందుకు అందరికీ అవకాశం ఉంది. 

58

యజ్వేంద్ర చాహాల్, వరల్డ్ కప్‌లో ఆడాలి. అతన్ని మేం కచ్ఛితంగా వాడుకుంటాం.. అలాగే అశ్విన్, వాషింగ్టన్ విషయంలోనూ అంతే..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
 

68
Sanju Samson and Chahal

ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు యజ్వేంద్ర చాహాల్. ‘ఆస్తమించిన సూర్యుడు, మళ్లీ రేపు ఉదయిస్తాడంటూ’ రెండు ఎమోజీలను ట్వీట్ చేశాడు చాహాల్..

78

2018 ఇంగ్లాండ్ టూర్‌కి ప్రకటించిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. ఆ సమయంలో రోహిత్ శర్మ కూడా ఇలాంటి ట్వీటే చేశాడు. ‘సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు..’ అంటూ రోహిత్ వేసిన ట్వీట్ అప్పట్లో పెను దుమారం రేపింది...

88

రోహిత్ శర్మ లేకుండా 2018 ఇంగ్లాండ్ టూర్‌లో టీ20 సిరీస్ నెగ్గిన భారత జట్టు, వన్డే, టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ 593 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా మిగిలిన బ్యాటర్లు అందరూ అట్టర్ ఫ్లాప్ కావడంతో 4-1 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయింది భారత జట్టు.. ఇప్పుడు అలాంటి రిజల్ట్ రిపీట్ కావద్దని కోరుకుంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.. 

Read more Photos on
click me!

Recommended Stories