ఆ మ్యాచ్ తర్వాత వేలానికి ఆర్‌సీబీ బ్లూ జెర్సీ... వచ్చిన మొత్తాన్ని ఏం చేస్తామో చెప్పిన విరాట్ కోహ్లీ...

First Published Sep 18, 2021, 4:17 PM IST

యూఏఈలో జరిగే ఐపీఎల్ ఫేజ్ 2లో తమ మొదటి మ్యాచ్‌లో ఎరుపు రంగు జెర్సీలో కాకుండా బ్లూ కలర్ జెర్సీలో బరిలో దిగనున్నారు రాయల్ ఛాలెంజర్స్... ఇప్పటికే ఈ బ్లూ కలర్ జెర్సీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది...

యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 ఫేజ్‌2లో మొదటి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలబడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఈ మ్యాచ్‌లో బ్లూ కలర్ జెర్సీలో కనిపించబోతున్నారు ఆర్‌సీబీ ప్లేయర్లు...

రెండేళ్లుగా కరోనాపై నిర్విరామంగా యుద్ధం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి కృతజ్ఞతగా బ్లూ కలర్ జెర్సీలో కనిపించబోతున్నారు ఆర్‌సీబీ ప్లేయర్లు...

ఈ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు ధరించిన జెర్సీలను ఆన్‌లైన్ వేలంలో విక్రయించనున్నట్టు తెలిపాడు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... 

‘కేకేఆర్‌తో జరిగే మ్యాచ్ తర్వాత ఆర్‌సీబీ బ్లూ కలర్ జెర్సీలను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తాం. ఇలా వచ్చిన మొత్తాన్ని భారత్‌లో వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తాం...’ అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ...

ప్రతీ ఏడాది పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ ‘గో గ్రీన్’ సందేశంతో ఓ మ్యాచ్‌లో ప్రత్యేకంగా గ్రీన్ కలర్ జెర్సీల్లో కనిపించే ఆర్‌సీబీ ప్లేయర్లు, ఈసారి బ్లూ కలర్ జెర్సీలో కనిపించబోతుండడం విశేషం.

ఈ ఏడాది ఐపీఎల్‌ను ఘనంగా ఆరంభించిన ఆర్‌సీబీ, వరుసగా నాలుగు విజయాలను అందుకుని మంచి ఊపుమీద ఉన్నట్టు కనిపించింది...

అయితే ఐదో మ్యాచ్‌లో సీఎస్‌కే చేతుల్లో చిత్తుగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్... మొదటి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది...

మిగిలిన ఏడు మ్యాచుల్లో మరో మూడు విజయాలు అందుకుంటే చాలు, ఇతర ఫ్రాంఛైజీల పర్ఫామెన్స్‌తో పనిలేకుండా నేరుగా ప్లేఆఫ్‌కి చేరుతుంది ఆర్‌సీబీ...

టీ20ల్లో కెప్టెన్సీకి వీడ్కోలు తెలిపిన విరాట్ కోహ్లీ, ఈ సీజన్ తర్వాత ఆర్‌సీబీ జట్టు కెప్టెన్సీ కూడా వీడ్కోలు చెబుతాడని ప్రచారం జరుగుతోంది...

అలాగే విరాట్ కోహ్లీ మిత్రుడు, ఆర్‌సీబీ వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్‌కి ఇదే ఆఖరి ఐపీఎల్. వచ్చే సీజన్‌లో ఆడబోనని, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటానని ఇప్పటికే ప్రకటించాడు ఏబీడీ...

click me!