శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్థనేకి బీసీసీఐ బంపర్ ఆఫర్... ఆ రెండింటికీ తప్ప...

Published : Sep 18, 2021, 02:49 PM ISTUpdated : Sep 18, 2021, 03:13 PM IST

టీమిండియా తర్వాతి కోచ్ ఎవరు? ఇప్పుడు ఈ విషయంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. నాలుగేళ్లుగా టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగుస్తుండడంతో తర్వాతి కోచ్‌గా అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, విక్రమ్ రాథోడ్ వంటి మాజీ క్రికెటర్ల పేరు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా హెడ్‌కోచ్‌‌గా వ్యవహరించేందుకు శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్థనేకి బంపర్ ఆఫర్ ఇచ్చిందట బీసీసీఐ...

PREV
18
శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్థనేకి బీసీసీఐ బంపర్ ఆఫర్... ఆ రెండింటికీ తప్ప...

ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ, టీమిండియా హెడ్‌కోచ్‌ పదవికి ఆఫర్ ఇచ్చిందంటే భారీ మొత్తంలో పారితోషికం చెల్లించేందుకు కూడా సిద్ధమైనట్టే...

28

అయితే బీసీసీఐ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట మహేళ జయవర్థనే... ప్రస్తుతం శ్రీలంక అండర్19 క్రికెట్ జట్టుకి కోచ్‌గా ఉన్న జయవర్థనే, తాను తన కెరీర్‌లో శ్రీలంకకి, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి మాత్రమే కోచ్‌గా ఉంటానని స్పష్టం చేశాడట...

38

శ్రీలంక జట్టుకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేళ జయవర్థనే, తన కెరీర్‌లో 149 టెస్టులు, 448 వన్డేలు, 55 టీ20 మ్యాచులు ఆడాడు... 

48

బ్యాట్స్‌మెన్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 25 వేలకు పరుగులు చేసిన జయవర్థనే, టెస్టుల్లో 34, వన్డేల్లో 19 శతకాలతో కలిపి 53 సెంచరీలు కూడా చేశాడు...

58

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుకి బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన జయవర్థనే, 2017 నుంచి ముంబై ఇండియన్స్‌కి హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు...

68

మహేళ జయవర్థనే కోచింగ్‌లో ముంబై ఇండియన్స్‌ 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్స్ గెలిచింది. బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో కుల్నా టైటాన్స్ జట్టుకి, ది హండ్రెడ్‌ టోర్నీలో సౌంతిప్టన్ జట్లకి కోచ్‌గా వ్యవహరించాడు...

 

78

ఈ ఏడాది శ్రీలంక అండర్ 19 జట్టుకి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న మహేళ జయవర్థనే, 2022 నాటికి శ్రీలంక జట్టుకి మేటి క్రికెటర్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించాడు...

88

ప్రస్తుతం శ్రీలంక యువ జట్టుకి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుండడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకుని, టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడానికి మహేళ జయవర్థనే సుముఖంగా లేడని... అందుకే బీసీసీఐ ప్రస్తుతం అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్‌లతో హెడ్ కోచ్ పదవి గురించి చర్చిస్తోందని సమాచారం...

click me!

Recommended Stories