IPL 2021: సచిన్ టెండూల్కర్ రికార్డును చెరిపేసిన రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక సార్లు...

Published : Sep 18, 2021, 03:20 PM IST

డెక్కన్ ఛార్జర్స్ జట్టు నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా టీమిండియాలోకి వస్తూ, పోతూ ఉన్న రోహిత్, భారత జట్టులో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచి, ఇప్పుడు టీ20 కెప్టెన్‌గానూ బాధ్యతలు చేపట్టబోతున్నాడు..

PREV
110
IPL 2021: సచిన్ టెండూల్కర్ రికార్డును చెరిపేసిన రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక సార్లు...

ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటికే ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి లీగ్ ప్రారంభంలో తెగ ఇబ్బంది పడింది. జట్టు నిండా భారీ హిట్టర్లు ఉన్నా, చెన్నైలో జరిగిన మ్యాచుల్లో 150+ స్కోరు చేయడానికి తెగ కష్టపడింది...

210

అయితే ఎలాగోలా బౌలర్ల కృషి కారణంగా ఏడు మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచిన ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2021 సీజన్‌కి బ్రేక్ పడే సమయానికి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది...

310

మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ఫ్లేఆఫ్ చేరాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో కనీసం నాలుగు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది ముంబై ఇండియన్స్...

410

టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న రోహిత్, ఈసారి బ్యాట్స్‌మెన్‌గానూ తన సత్తా ఏంటో నిరూపించుకోవాలంటూ కొందరు మాజీ క్రికెటర్లు కామెంట్ చేశారు...

510

అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక సార్లు టాప్ స్కోరర్‌గా నిలిచిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును ఎప్పుడో అధిగమించాడు రోహిత్ శర్మ...

610

సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్ తరుపున 78 మ్యాచులు ఆడి, 33.83 సగటుతో 2334 పరుగులు చేసి... 21 సార్లు ముంబై ఇండియన్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

710

రోహిత్ శర్మ, తన కెరీర్‌లో 207  ఐపీఎల్ మ్యాచులు ఆడగా... అందులో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన మ్యాచులే 168. ఇందులో 36 సార్లు ముంబై తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు ‘హిట్ మ్యాన్’...

810

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న ముంబై మాజీ ప్లేయర్ అంబటి రాయుడు, 20 సార్లు ముంబై ఇండియన్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచి... రోహిత్, సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు...

910

ముంబై ఇండియన్స్ తరుపున 150+ మ్యాచులు ఆడిన కిరన్ పోలార్డ్, 18 సార్లు టాప్ స్కోరర్‌గా నిలవగా... గత మూడు సీజన్లలో 400+ స్కోర్లు చేసి టీమిండియాలోకి దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ 12 సార్లు టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

1010

లెండిల్ సిమన్స్ 12 సార్లు టాప్ స్కోరర్‌గా నిలవగా, ప్రస్తుత ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటర్ డి కాక్ 11 సార్లు టాప్ స్కోరర్‌గా నిలిచి... లిస్టులో ఏడో స్థానంలో ఉన్నాడు...

click me!

Recommended Stories