ప్రాక్టీస్ లేదు.. ఫలితాలెలా వస్తాయి..? అందుకే ఓడుతున్నాం : జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Jul 25, 2022, 03:52 PM IST

Jos Buttler: ఇంగ్లాండ్ క్రికెట్ లో భారీ చర్చకు తెరదీసిన బెన్ స్టోక్స్ వన్డేల రిటైర్మెంట్ కు పొడగింపా అన్నట్టు.. తాజాగా ఆ జట్టు పరిమిత ఓవర్ల సారథి జోస్ బట్లర్ బిజీ షెడ్యూల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

PREV
17
ప్రాక్టీస్ లేదు.. ఫలితాలెలా వస్తాయి..? అందుకే ఓడుతున్నాం : జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్  ఆ దేశపు క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా తీరికలేని షెడ్యూల్ తో తాము అలిసిపోతున్నామని, అందుకే తగిన ఫలితాలను  సాధించలేకపోతున్నామని  తెలిపాడు. 

27

దక్షిణాఫ్రికాతో ఆదివారం మూడో వన్డే వర్షార్షణం అయిన తర్వాత బట్లర్ మాట్లాడుతూ.. వన్డేలు, టీ20లకు మధ్య ప్రాక్టీస్ చేసుకోవడానికి సమయం లేదని, అందుకే  ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని  చెప్పకనే చెప్పాడు. 

37

బట్లర్ స్పందిస్తూ.. ‘మ్యాచ్ కు మ్యాచ్ కు మధ్య  ట్రైనింగ్ చాలా అవసరం. శిక్షణ లేకుండా నేరుగా మ్యాచ్ లు ఆడాల్సి వస్తున్నది.  జట్టు సమిష్టిగా రాణించాలన్నా టీమ్ లో ఎనర్జీ నింపాలన్నా  శిక్షణా కార్యక్రమాలు విరివిగా ఉండాలి. తద్వారా మేమంతా ఒకరితో ఒకరం కనెక్ట్ అవుతాం. 

47

మా బలాలు, బలహీనతలు తెలుస్తాయి. జట్టు విజయానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..? ఎలా ముందుకుసాగాలి..? అనేదానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కానీ తీరిక లేని షెడ్యూల్స్ వల్ల  సరైన ట్రైనింగ్ లేకుండా పోతున్నది. ఆడటానికి ముందు ట్రైనింగ్ ఎంతో అవసరం. శిక్షణ లేకుండా మీరు వంద శాతం ఇవ్వడం పక్కనబెడితే 90కి 90 శాతం కూడా ఇవ్వలేరు. దాంతో ఆటగాళ్లలో ఫ్రస్ట్రేషన్ కూడా పెరుగుతుంది’ అని అన్నాడు. 

57

అంతేగాక.. ‘మీరు గ్రౌండ్ లో బెస్ట్ ఇవ్వాలంటే అంతకుముందు మీరు ట్రైనింగ్ సెషన్ లో కష్టపడాలి. ఆటలో ఒత్తిడిని తట్టుకోవడానికి కూడా ట్రైనింగ్ క్యాంప్స్ ఉపయోగపడతాయి. అలా కాక ప్రతీసారి గేమ్ మోడ్ లో ఉండటమనేది సరైంది కాదు.  అందుకు మీరు సక్రమంగా సన్నద్ధమవ్వాలి. జట్టుగా ముందు మేం దానిపై దృష్టి సారించాలి..’ అని బట్లర్ చెప్పాడు.

67

కొత్త కెప్టెన్ గా తాను ఆటగాళ్లతో విరివిగా చర్చించడానికి సమయమే దొరకడం లేదని బట్లర్ వాపోయాడు.  తాను పడుకునేప్పుడో ఇతర పనులు చేసుకునేప్పుడో కోచ్ తో ఆటగాళ్లతో ఫోన్ లో మాట్లాడి ఇవన్నీ చేయాల్సి వస్తుందని బట్లర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తనకే చిరాగ్గా ఉందని తెలిపాడు.  ఇది మ్యాచ్ ఆడేప్పుడు తమ ముఖాల్లో కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని బట్లర్ అన్నాడు. వికెట్ తీసినప్పుడు తప్ప మిగతా సందర్భాలలో ఆటగాళ్ల ముఖాల్లో ఆనందమనేదే లేకుండా ఉంటుందని బట్లర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  

77

బట్లర్ చెప్పినట్టు.. గడిచిన రెండునెలలుగా ఇంగ్లాండ్ తీరిక లేని క్రికెట్ ఆడుతున్నది. అటు టెస్టులలో బెన్ స్టోక్స్ సారథ్యంలో  న్యూజిలాండ్ తో మూడు టెస్టులు ఆడుతుండగానే వన్డే జట్టు నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ఆడింది.  ఆ తర్వాత ఇండియాతో టెస్టు ఆడిన రెండ్రోజులకే టీ20 సిరీస్.. అది ముగిశాకే వన్డే సిరీస్ ఆడింది. టీమిండియాతో వన్డే సిరీస్ ముగిసిన రెండ్రోజులకే మళ్లీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడింది. మళ్లీ బుధవారం నుంచి అదే సషారీలతో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. 

click me!

Recommended Stories