మావాళ్లను క్షేమంగా ఇంటికి పంపించినందుకు థ్యాంక్యూ... బీసీసీఐకి సీఏ సీఈవో నిక్ హక్‌లీ...

First Published May 17, 2021, 5:19 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనేందుకు ఇండియాకి వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్ల బృందం... ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. భారత్ నుంచి వచ్చే విమాన రాకపోకలపై ఆస్ట్రేలియా నిషేధం విధించడంతో కొన్నాళ్ల పాటు మాల్దీవుల్లో గడిపిన ఆసీస్ ప్లేయర్లు, ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు.

కరోనా పాజిటివ్ కేసుల కారణంగా మే 4న ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొనడానికి వచ్చిన విదేశీ క్రికెటర్లు తమ తమ దేశాలకు వెళ్లిపోయారు...
undefined
అయితే భారత్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం ఉండడంతో ఆస్ట్రేలియాకి చెందిన 14 మంది క్రికెటర్లతో పాటు కోచ్‌లు, కామెంటేటర్లు, సహాయక సిబ్బంది ఇక్కడే ఉండిపోయారు...
undefined
భారత్‌తో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా బృందాన్ని మాల్దీవులకు పంపించి, అక్కడ వారికి సకల వసతులు ఏర్పాటు చేసింది బీసీసీఐ. మే 6 నుంచి మాల్దీవుల్లో బస చేసిన ఆసీస్ టీమ్, ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది.
undefined
మే 15న భారత్‌ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై ఉన్న నిషేధం ఎత్తివేయడంతో మాల్దీవుల నుంచి బీసీసీఐ ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఇంటికి చేరుకున్నారు 38 మంది ఆసీస్ క్రికెటర్లు, బృందం...
undefined
సిడ్నీకి చేరుకున్న వీరంతా... అక్కడ రెండు వారాలు హోటెల్‌లో ఐసోలేషన్‌లో గడుపుతారు. ఆ తర్వాత వారివారి ఇళ్లకు చేరుకుంటారని తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా...
undefined
‘మా వాళ్లను క్షేమంగా, సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు బీసీసీఐకి థ్యాంక్యూ... ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మా వాళ్లను కంటిరెప్పలా కాచుకున్నారు. వారితో నేను ఇంకా మాట్లాడలేదు. కానీ మెసేజ్ చేసి సమాచారం తెలుసుకున్నాను...’ అంటూ తెలిపాడు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హక్‌లే...
undefined
click me!