ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ గెలవడమే, రోహిత్ కెప్టెన్సీకి అసలైన పరీక్ష! ఇది కాని పోయిందో...

First Published Jan 15, 2023, 5:06 PM IST

ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. అయితే ఈ రెండు సిరీస్‌ల తర్వాత ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గురించే చాలామంది అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు...

Pat Cummins

ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో యాషెస్ సిరీస్‌ని 4-0 తేడాతో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో టెస్టు సిరీస్‌లు గెలిచి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ని ఖరారు చేసుకుంది...

మరోవైపు రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ తప్ప మరో టెస్టు ఆడలేకపోయాడు. గాయంతో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టుకి, బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు రోహిత్ శర్మ...

దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ టీమ్‌ని నడిపించే విధానం అతని కెప్టెన్సీకి కీలక పరీక్ష కానుంది. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఉన్న ఫామ్‌లో వారిని స్వదేశంలో ఓడించాలంటే టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే...

Image credit: Getty

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఇంకా గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు! ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సమయానికి ఈ ఇద్దరూ ఎంత వరకూ ఫిట్‌నెస్ సాధిస్తారనే విషయంపై బీసీసీఐ దగ్గర కూడా క్లారిటీ లేదు...

Rishabh Pant

అదీకాకుండా ఆస్ట్రేలియా టూర్‌ 2020-21లో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్, కారు ప్రమాదానికి గురై క్రికెట్‌కి దూరమయ్యాడు. రిషబ్ పంత్ లేని లోటు తీర్చే వికెట్ కీపింగ్ బ్యాటర్‌ని ఇప్పట్లో వెతికి పట్టుకోవడం కాని పని...

ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ని గెలిపించాలంటే, అది కూడా ఆస్ట్రేలియాని ఓడించాలంటే మామూలు విషయం కాదు. అదీకాకుండా ఈ టెస్టు సిరీస్ ఫలితం తేడా కొడితే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే ఛాన్సుని కోల్పోతుంది భారత జట్టు...

దీంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ని ఎలాగైనా గెలిపించడం రోహిత్ శర్మకు చాలా అవసరం. ఆసీస్‌తో టెస్టు సిరీస్ సమయానికి టీమిండియా కెప్టెన్ తన అస్త్రాలన్నింటినీ సంధించేందుకు సిద్ధంగా పెట్టుకోవాల్సిందే..  

click me!