ఆ టైమ్‌లో ఆడితే వాళ్లకు అడ్వాంటేజ్! వన్డే వరల్డ్ కప్ మ్యాచుల టైమింగ్‌పై అశ్విన్ సలహా..

First Published Jan 15, 2023, 4:36 PM IST

అసలు లిస్టులో కూడా లేకుండా ఏకంగా రెండు టీ20 వరల్డ్ కప్స్ ఆడేశాడు రవిచంద్రన్ అశ్విన్. నాలుగేళ్ల పాటు వైట్ బాల్ క్రికెట్‌కి దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, టీ20 వరల్డ్ కప్‌తోనే రీఎంట్రీ ఇస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. లక్కీగా రెండు టీ20 వరల్డ్ కప్స్ ఆడిన అశ్విన్, అదే అదృష్టం కలిసి వస్తే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లోనూ ఉండొచ్చు...

ధోనీ హయాంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ జోడిగా ఉంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాక యజ్వేంద్ర చాహాల్-కుల్దీప్ యాదవ్ జోడిని వైట్ బాల్‌ క్రికెట్‌కి పరిమితం చేసి అశ్విన్- జడేజాలను టెస్టుల్లో వాడాడు... 

Image credit: Getty

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్రమేణా మూడు ఫార్మాట్లలో రీఎంట్రీ ఇవ్వగా రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టెస్టులకే పరిమితం అయ్యాడు. అలాంటిది అశ్విని, అనుకోకుండా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ జట్టులో చోటు దక్కించుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది..

Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత కొన్ని సిరీసులు ఆడి మాయమైన రవిచంద్రన్ అశ్విన్, తిరిగి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ ఆడాడు. నాలుగేళ్లుగా భారత జట్టుకి వైట్ బాల్ ఫార్మాట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వచ్చిన యజ్వేంద్ర చాహాల్ రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు..

తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మ్యాచ్ టైమింగ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రవిచంద్రన్ అశ్విన్. శ్రీలంకతో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్, తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చేసి అభిమానులతో అభిప్రాయాలను పంచుకుంటున్నాడు...

‘నా అభిప్రాయం అనుకోండి, లేదా నా సలహా అనుకోండి.. వరల్డ్ కప్‌లో మనం ఆడుతున్న వేదికలు, టైమింగ్స్‌ని ఓ సారి చూస్తే... అన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతున్నాయి...

డే నైట్ వన్డే మ్యాచుల కారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే వారికి అడ్వాంటేజ్ దొరుకుతుంది. అక్టోబర్-నవంబర్ మాసాల్లో వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు...
 

చలి, గాలిలో తేమ కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారి ఫీల్డర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమిస్తే ఈ సమస్య చాలా వరకూ తగ్గుతుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు రవిచంద్రన్ అశ్విన్.. 

టీమిండియా తరుపున 113 వన్డే మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 151 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ కెప్టెన్సీలో 2017 జూన్‌లో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన అశ్విన్, 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు... ఆ తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయిన అశ్విన్, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో 2022 జనవరిలో రెండు వన్డేలు ఆడాడు.. 

click me!