గబ్బాలో అక్కడే తప్పు జరిగింది, వాళ్లు గెలుస్తారని... ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా...

First Published Jun 7, 2021, 4:17 PM IST

భారత మోడ్రన్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయం ఆసీస్ టూర్‌లో టెస్టు సిరీస్ విక్టరీ. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి, 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది భారత జట్టు. ఈ టెస్టు సిరీస్‌పై తాజాగా స్పందించాడు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసి ఐదు నెలలు దాటుతున్నా, ఆ షాక్ నుంచి ఇంకా తేలుకోలేదు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేని జట్టు చేతిలో గబ్బా టెస్టులో ఆసీస్‌కి ఎదురైన ఓటమి, ఆసీస్ మాత్రమే కాదు... క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ ఊహించనిది.
undefined
‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఇంతలా ఆకట్టుకుంటుందని నేను ఏ మాత్రం ఊహించలేదు. విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద వెళ్లిపోయిన తర్వాత విజయం మాదేనని అనుకున్నాం. ఆడిలైడ్ టెస్టులో దొరికిన విజయం కూడా ఆ భరోసా, నమ్మకం రావడానికి కారణం.
undefined
అయితే మా ఓటమికి కారణం బౌలర్లే. అవును. సిడ్నీ టెస్టులోనే మేం ఈజీగా గెలవాల్సింది. అయితే మా బౌలర్లు మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయారు. గబ్బా టెస్టులోనూ అంతే....
undefined
ఆఖరి రోజు ప్రత్యర్థిని నియంత్రించడానికి కావాల్సినన్ని పరుగులు, ఆసీస్ జట్టు చేసింది. భారీ టార్గెట్‌ను విధించినప్పుడు వేదిక ఏదైనా నాలుగో ఇన్నింగ్స్‌లో విజయం రావడం ఆనవాయితీ.
undefined
అయితే టీమిండియా అద్భుతం చేసింది. భారత జట్టు విజయానికి పూర్తిగా అర్హులు. మా జట్టులో ఎంతమంది సీనియర్లు ఉన్నా, గబ్బాలో బెటర్ టీమ్‌ అని నిరూపించుకుంది...
undefined
మా ఫాస్ట్ బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్‌ చక్కగా ఆడారు. పేస్ అటాక్‌ను చేధించారు. స్పిన్ బౌలర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో భారీగా పరుగులు సాధించారు. ఆఖరి రోజు ఆట ‘టెస్టు క్రికెట్ అందాన్ని చూపించింది’... టెస్టులకు ఆదరణ దక్కడానికి ఇలాంటి మ్యాచులు కావాలి...
undefined
నిజమే, ఆస్ట్రేలియా జట్టులో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండింది. ఎందుకంటే మేం అక్కడ 31 ఏళ్లుగా ఓడిపోలేదు. అయితే ఎలాంటి చోటైనా మంచిగా ఆడకపోతే ఓటమి ఎదుర్కోక తప్పదు. అయితే ఆ రోజు మేం బాగానే ఆడాం, కానీ భారత్ మాకంటే బాగా ఆడింది...
undefined
ఆస్ట్రేలియా క్రికెటర్‌గా, ఆస్ట్రేలియా ఫ్యాన్‌గా ఓటమి నిరాశపరిచింది. కానీ భారత జట్టు గబ్బాలో ఇలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు, భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా..’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా.
undefined
click me!