ఐపీఎల్‌లో ఆ ముగ్గురికీ క్లీన్ బౌల్డ్ చేశా, ఇంకేం కావాలి... రషీద్ ఖాన్ కామెంట్...

First Published Jun 7, 2021, 4:39 PM IST

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడే ఆఫ్ఘాన్ యువ సంచలనం రషీద్ ఖాన్, తన ఫెవరెట్‌ వికెట్స్ వాళ్లేనంటూ ముగ్గురి పేర్లను ప్రకటించాడు. టీ20ల్లో బెస్ట్ త్రీ వికెట్లు చెప్పమంటే చాలా కష్టమని చెప్పిన రషీద్ ఖాన్... భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిల్లియర్స్‌ను అవుట్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు.

టీ20ల్లో 360 వికెట్లు తీసిన 22 ఏళ్ల రషీద్ ఖాన్, సంచలన ప్రదర్శనతో అదరగొడుతూ దూసుకుపోతున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడే రషీద్ ఖాన్, పాక్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్ లీగుల్లో కూడా పాల్గొంటున్నాడు.
undefined
‘నా కెరీర్‌లో ఎంతో మంది మేటి బ్యాట్స్‌మెన్లను అవుట్ చేశాడు. కానీ ది బెస్ట్ త్రీ వికెట్లను ఎంచుకొమ్మంటే మాత్రం వాళ్లు ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్... ఐపీఎల్‌లో వాళ్ల వికెట్లను తీయడం ఎన్నటికీ మరిచిపోలేను. ఈ ముగ్గురికీ నేను క్లీన్‌బౌల్డ్ చేశా...
undefined
బౌలర్లకు చాలా రకాలుగా వికెట్లు పడుతూ ఉంటాయి. క్యాచులు అందుకున్నప్పుడు, ఎల్బీడబ్ల్యూ రూపంలో ఇలా... అయితే ధోనీ, కోహ్లీ, డివిల్లియర్స్ లాంటి లెజెండరీ క్రికెటర్లను బౌల్డ్ చేస్తే వచ్చే ఫీలింగ్ వేరేలా ఉంటుంది... అది చాలా పెద్ద అఛీవ్‌మెంట్...
undefined
ఈ ముగ్గురు అద్భుతమైన బ్యాట్స్‌మెన్. ఓ స్పిన్నర్‌గా వారిని బౌల్డ్ చేయడం అంత తేలికయ్యే పని కాదు. అందుకే అవి నా మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నా కెరీర్‌లో తీసుకున్న బెస్ట్ వికెట్లు వారే...’అంటూ చెప్పుకొచ్చాడు రషీద్ ఖాన్.
undefined
ప్రస్తుతం పాక్ సూపర్ లీగ్‌లో పాల్గొనేందుకు అబుదాబిలో ఉన్నాడు రషీద్ ఖాన్. 2021 సీజన్‌లో లాహోర్ ఖలందర్స్‌ తరుపున రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు రషీద్ ఖాన్. ఐపీఎల్ కంటే ముందే ప్రారంభమైన పీఎస్‌ఎల్ కూడా కరోనా పాజిటివ్ కేసుల కారణంగా వాయిదా పడింది...
undefined
‘నేను పీఎస్‌ఎల్ 6లో కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడగలిగాను, ఎందుకంటే ఆ సమయంలో ఆప్ఘాన్ మ్యాచులు ఉండడం వల్ల వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్‌లో కౌంటీల కోసం ఉండాల్సి వచ్చేది. అయితే వాళ్లు నన్ను అర్థం చేసుకుని, పీఎస్‌ఎల్ కోసం పంపించారు.
undefined
కౌంటీల్లో ఇంకా ఐదు మ్యాచులు ఆడాల్సిన నేను, పీఎస్‌ఎల్ మొత్తానికి అందుబాటులో ఉండాలని వచ్చేశా. దీనికి కారణం ఫ్యాన్స్‌, పాక్ సూపర్ లీగ్ ఆడాలని కోరుకోవడమే...’ అంటూ చెప్పుకొచ్చాడు రషీద్ ఖాన్.
undefined
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సుసెక్స్ తరుపున ఆడిన రషీద్ ఖాన్, పాక్ సూపర్ లీగ్ ముగిసిన తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున మిగిలిన 7 మ్యాచులు ఆడతాడు.
undefined
ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో బరిలో దిగే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత బిజీగా క్రికెట్ ఆడుతున్న క్రికెటర్ మరెవ్వరూ లేకపోవడం విశేషం. రషీద్ ఖాన్ అన్ని టీ20 లీగులు చుట్టేసి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు.
undefined
click me!