IPL: ఐపీఎల్ కు ముందు టీమిండియాను వీడిన యుజ్వేంద్ర చాహల్.. ఆ జట్టు క్యాంప్ లోకి..

Published : Mar 03, 2022, 03:36 PM IST

IPL 2022: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర  చాహల్ జట్టును వీడాడు. ఐపీఎల్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అతడు జైపూర్ కు  పయనమయ్యాడు. 

PREV
19
IPL: ఐపీఎల్ కు ముందు టీమిండియాను వీడిన యుజ్వేంద్ర చాహల్.. ఆ జట్టు క్యాంప్ లోకి..

మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టీమిండియాను వీడాడు. ఇటీవలే ముగిసిన విండీస్, లంకతో సిరీస్ లలో  భారత జట్టు తరఫున ఆడిన  చాహల్.. జాతీయ జట్టును వీడాడు. 

29

లంకతో టెస్టులకు అతడు ఎంపిక కాలేదు.  పరిమిత ఓవర్ల క్రికెట్  లో స్పెషలిస్టు  స్పిన్నర్ గా గుర్తింపు పొందిన  చాహల్.. ఇండియా-శ్రీలంక  మూడు మ్యాచుల టీ20 సిరీస్ ముగియగానే జట్టుకు గుడ్ బై చెప్పేశాడు.

39

టీమిండియాను వీడిన  చాహల్.. ఐపీఎల్ లో తాను కొత్తగా ఆడబోతున్న రాజస్థాన్ రాయల్స్ తో కలువనున్నాడు.  ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు.. చాహల్ ను రూ. 6.50 కోట్లకు  దక్కించుకున్న విషయం తెలిసిందే. 

49

మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఇప్పటికే ఆయా జట్లన్నీ సన్నాహాలు ప్రారంభించాయి.  క్యాంపులను ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో.. రాబోయే ఐపీఎల్ లో అనుసరించిన వ్యూహాలు, ఇతరత్రా అంశాలపై  చర్చిస్తున్నాయి. 
 

59

గతేడాది వరకు   రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తో ఆడిన చాహల్ ను ఈసారి రాజస్థాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో కెరీర్ ప్రారంభించిన చాహల్.. 2018 నుంచి  బెంగళూరుకు ఆడుతున్నాడు. 

69

ఐపీఎల్ లో అశ్విన్ తర్వాత వంద వికెట్లు  తీసిన స్పిన్నర్ల జాబితాలో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 114 మ్యాచులాడిన చాహల్.. 139 వికెట్లు తీశాడు. 

79

ఇక గత సీజన్ లో  బెంగళూరు తరఫున ఆడుతూ.. 15 మ్యాచులలోనే 18 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేయడంతో  తిరిగి అతడు భారత జట్టులో చోటు సంపాదించాడు. 

89

నాలుగు సీజన్ల పాటు బెంగళూరు తో ఆడిన చాహల్.. కొత్త సీజన్ లో మాత్రం రాజస్థాన్ తో ఆడనున్నాడు. కాగా.. రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ కూడా  త్వరలోనే ఆ జట్టు నిర్వహించబోయే క్యాంప్ లో కలువనున్నాడు. 

99

క్యాంప్ కంటే ముందు ఈ ఆటగాళ్లంతా మూడు నుంచి ఐదు రోజుల దాకా  క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది. దీంతో అందుబాటులో ఉన్న ఆటగాళ్లంతా తమ తమ జట్లు నిర్వహిస్తున్న క్యాంపులకు చేరుకుంటున్నారు.  

click me!

Recommended Stories