టెస్టు సారథిగా విరాట్ కోహ్లీ బాధ్యతలు తీసుకున్న సమయంలో టీమిండియా ఏడో ర్యాంకులో ఉంది. అలాంటి జట్టును వరుసగా ఐదేళ్లు టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిపాడు విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్న మ్యాచ్‌లోనే భారత నయా సారథి రోహిత్ శర్మ, టెస్టుల్లో కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నాడు...
29
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు రోహిత్ శర్మ. టెస్టు క్రికెట్‌లో విరాట్ ఓ స్పెషల్ ప్లేయర్ అంటూ కితాబు ఇచ్చాడు...
39
‘విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా అసాధ్యమైన విజయాలు అందించాడు. టెస్టు కెప్టెన్‌గా అతని ప్రయాణాన్ని తలుచుకుంటేనే దిమ్మ తిరుగుతుంది...
49
విరాట్ కోహ్లీ వందో టెస్టును స్పెషల్‌గా చేయాలని అనుకుంటున్నాం. మొహాలీ టెస్టు ఐదు రోజుల పాటు సాగుతుందని ఆశిస్తున్నా. టీమ్‌గా మేం 2018లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచాం...
59
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా సాధించిన విజయాల్లో అది నా ఫెవరెట్. అలాగే 2013లో సౌతాఫ్రికాలో విరాట్ చేసిన టెస్టు సెంచరీ... ఇప్పటికీ నా కళ్ల ముందే ఉంది...
69
బౌలింగ్‌కి సహకరించని బౌన్సింగ్ పిచ్‌పై అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ... సౌతాఫ్రికాలో మాలో చాలామందికి అదే మొట్టమొదటి పర్యటన...
79
మోర్కెల్, డేల్ స్టేయిన్‌లను వారి దేశంలో ఎప్పుడూ ఫేస్ చేసిన అనుభవం కూడా లేదు. కానీ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనే అదరగొట్టాడు. పెర్త్‌లో ఆడిన ఇన్నింగ్స్ అయితే వేరే లెవెల్...
89
ఇప్పుడు టీమిండియా టెస్టుల్లో ఇంత స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది అంటే దానికి విరాట్ కోహ్లీ కెప్టెన్సీయే కారణం...
99
భారత జట్టు సాధించిన విజయాలు, సాధించబోయే విజయాల్లోనూ విరాట్ కోహ్లీకి కచ్ఛితంగా క్రెడిట్ దక్కుతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత సారథి రోహిత్ శర్మ...