అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని, కామెంటేటర్‌గా కూడా ట్రై చేసిన పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, ఇప్పుడు చాలా ఖాళీగా ఉన్నట్టున్నాడు. అందుకే ఈ మధ్య యూట్యూబ్ వీడియోలతో తెగ బిజీ బిజీగా ఉంటూ... ఇన్‌డైరెక్టుగా ఆదాయాన్ని ఆర్జించే పనిలో పడ్డాడు...
యూట్యూబ్ వీడియోల కోసం సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెగ హడావుడి చేస్తున్న షోయబ్ అక్తర్, తాజాగా తన లైఫ్‌లో జరిగిన అనుభవాలను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాడు...
29
Shoaib Akhtar
‘2004లో మేం న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లాం. ఆ సమయంలో నేను ఓ మ్యాచ్‌కి ముందు గాయపడ్డాను. దాంతో నన్ను విశ్రాంతి తీసుకొమ్మని టీమ్ మేనేజ్‌మెంట్ సూచించింది...
39
గాయం తీవ్రత ఎక్కువ ఉండడంతో ఏ పనులు చేయవద్దని, ఒత్తిడి పడితే మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్సులు ఉంటాయని డాక్టర్లు, మేనేజ్‌మెంట్ మరీ మరీ చెప్పి వెళ్లారు...
49
అయితే వాళ్లు వెళ్లగానే నేను ఓ హెలికాఫ్టర్ బుక్ చేసుకుని, బంగీ జంపింగ్‌కి వెళ్లాను. ఆ టైమ్‌లో నాకు గజ్జల్లో మళ్లీ గాయమైంది. ఎక్సర్‌సైజ్ తర్వాత ఆ నొప్పి మరింత పెరిగింది...
59
నా పుట్టినరోజు అప్పుడు నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. సముద్ర గర్భంలో షార్క్ చేపలకు ఆహారం వేసేందుకు తీసుకెళ్లారు. అక్కడ చాలా గొప్పగా ఉంటుందని చెప్పారు...
69
అయితే ఆ సమయంలో భయంతో నా కాళ్లు ఒణికిపోతున్నాయి. ఒక్కో షార్క్ 15 నుంచి 20 అడుగుల పొడవు ఉంది. మళ్లీ నీళ్లలోకి దూకే ప్రయత్నం చేయలేదు...
79
క్వీన్‌లాండ్స్‌లో వైట్ వాటర్ రాఫ్గింగ్ చేశాను. ఇలా విశ్రాంతి తీసుకొమ్మని చెబితే ఎక్కడొక్కడో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నా అని అధికారులు కనిపెట్టేశారు. నాకు చాలా పెద్ద ఫైన్ వేశారు...
89
ఆటకు బ్రేక్ వస్తే, నేను మరింత ఉత్సాహంగా టీమ్‌లోకి వచ్చేవాడిని. అయితే మేనేజ్‌మెంట్ మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోనేది కాదు. ఫస్ట్ క్లాస్ లెవెల్‌లోనూ అంతే... ’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్...
99
పాకిస్థాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్... టెస్టుల్లో 178, వన్డేల్లో 247, టీ20ల్లో 19 వికెట్లు తీశాడు...