పంత్ వద్దు.. కార్తీక్ ముద్దు.. వెటరన్‌ వికెట్ కీపర్‌కే ఛాన్స్ ఇవ్వనున్న టీమ్ మేనేజ్మెంట్

Published : Oct 14, 2022, 05:50 PM IST

T20I World Cup 2022:టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన జట్టులో రిషభ్ పంత్ తో పాటు దినేశ్ కార్తీక్ కు కూడా చోటు దక్కింది. ఈ ఇద్దర్లో  పంత్ కంటే కార్తీక్ ను ఆడించేందుకే టీమ్ మేనేజ్మెంట్ తో పాటు...   

PREV
16
పంత్ వద్దు.. కార్తీక్ ముద్దు.. వెటరన్‌ వికెట్ కీపర్‌కే ఛాన్స్ ఇవ్వనున్న టీమ్ మేనేజ్మెంట్

టీ20  ప్రపంచకప్ లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్ ను  ఈనెల 23న పాకిస్తాన్ తో ఆడనుంది. అంతకంటే  ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది.  అయితే పాకిస్తాన్ తో పోరులో టీమిండియా వికెట్ కీపర్ల విషయంలో ఎవరిని ఎంపిక చేస్తుందనేది  ఆసక్తికరంగా మారింది. 

26

టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన జట్టులో రిషభ్ పంత్ తో పాటు దినేశ్ కార్తీక్ కు కూడా చోటు దక్కింది. ఈ ఇద్దర్లో  పంత్ కంటే కార్తీక్ ను ఆడించేందుకే టీమ్ మేనేజ్మెంట్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ,  హెడ్ కోచ్ రాహుల్  ద్రావిడ్ కూడా  మొగ్గుచూపుతున్నారని తెలుస్తున్నది. 

36

వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లలో పంత్ భారత జట్టులో ఓపెనర్ గా బరిలోకి దిగాడు. రెండు మ్యాచ్ లలో కలిపి 18 పరుగులే చేశాడు. దీంతో వార్మప్ మ్యాచ్ నుంచే కార్తీక్ ను  సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. 

46

2022లో కార్తీక్..  181 బంతుల్లో 273  పరుగులు చేశాడు. 19 ఇన్నింగ్స్ లలో కార్తీక్ 150  స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు సాధించాడు.  మరోవైపు పంత్..  17 ఇన్నింగ్స్ లలో 338 పరుగులు చేశాడు. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్  136.84 గా ఉంది. గణాంకాల వైపుగా చూస్తే కార్తీక్ కంటే పంత్ పరుగులే ఎక్కువగా ఉన్నా గత కొన్ని  మ్యాచ్ ల నుంచి పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు.  

56

ఓపెనర్ గా విఫలమవుతున్న పంత్.. 5-6 స్థానాల్లో కూడా  రాణించడం లేదు.  కానీ కార్తీక్ మాత్రం ఫినిషర్ గా తన బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్,  దక్షిణాఫ్రికా  తో  కూడా కార్తీక్ ఫర్వాలేదనిపించాడు. దీంతో  కార్తీక్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశమున్నదని  జట్టు వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన. 

66

అదీగాక పంత్, కార్తీక్ ను ఇద్దరినీ ఆడించే అవకాశాలను పరిశీలించినా  అది కూడా టీమిండియాకు చేటు చేసేదే. పంత్ స్థానంలో ఒక ఆల్ రౌండర్ (దీపక్ హుడా, అక్షర్ పటేల్) ను కోల్పోయే పరిస్థితి ఉంటుంది.  అయితే ఇప్పటికే బౌలింగ్ వీక్ గా ఉన్న టీమిండియా ఇంత ధైర్యం చేసే అవకాశం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories