ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియాను సర్కస్‌లో జంతువుల్లా చూశారు... అశ్విన్ సంచలన వ్యాఖ్యలు...

First Published Jan 24, 2021, 1:52 PM IST

అనేక ఇబ్బందులను ఎదుర్కొని, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ సొంతం చేసుకుని చరిత్ర క్రియేట్ చేసింది భారత జట్టు. ఈ సిరీస్ ఆరంభం నుంచి చివరి టెస్టు చివరి రోజు దాకా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న టీమిండియాను ఆస్ట్రేలియాలో సర్కస్‌లో జంతువుల్లా చూశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ఆడిలైడ్ టెస్టులో మొదటి రెండు రోజులు టీమిండియా ఆధిపత్యమే నడిచింది...
undefined
అయితే మూడో రోజు మొదటి సెషన్‌లో అంతా మారిపోయింది. 36 పరుగులకే కుప్పకూలిన విరాట్ సేన, టెస్టు కెరీర్‌లో అతి చెత్త రికార్డును నమోదుచేసింది...
undefined
అలాంటి పరాజయం తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా కమ్ బ్యాక్ ఇచ్చిన భారత జట్టు... మిగిలిన మూడు టెస్టుల్లో రెండు విజయాలు అందుకుని, ఓ టెస్టు డ్రా చేసుకుంది...
undefined
అయితే మెల్‌బోర్న్‌లో భారత జట్టు విజయం సాధించిన తర్వాత టీమిండియాతో ఆస్ట్రేలియా నడుచుకునే విధానం పూర్తిగా మారిపోయిందని, సర్కస్‌ల్లో జంతువుల్లా చూస్తూ భారత జట్టును మానసికంగా, శారీరకంగా దెబ్బతీయాలని ఆసీస్ ప్రయత్నించిందని షాకింగ్ కామెంట్లు చేశాడు రవిచంద్రన్ అశ్విన్...
undefined
సిడ్నీ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ఆస్ట్రేలియా... ఈ టార్గెట్‌ను కొట్టడం టీమిండియా తరం కాదని, ఈజీగా గెలిచియొచ్చని భావించింది...
undefined
అయితే రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి 45 ఓవర్ల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడి, అసాధారణ పోరాటం చేశారు. ఈ అద్వితీయ పోరాటం కారణంగా సిడ్నీ టెస్టును డ్రా చేసుకోగలిగింది టీమిండియా...
undefined
‘సిడ్నీ టెస్టుకి ముందు నుంచే మాపై ఓ రకమైన ఒత్తిడి చేయాలని ప్రయత్నించింది ఆస్ట్రేలియా... మేం సిడ్నీలో ఆడడానికి ఇష్టపడడం లేదంటూ, బ్రిస్బేన్‌లో ఆడడానికి బయపడుతున్నామంటూ వార్తలు వచ్చాయి...
undefined
గబ్బాలో ఆడడానికి కానీ, సిడ్నీలో ఆడడానికి కానీ మేం ఎప్పుడూ భయపడలేదు... వేదిక మార్చాలని డిమాండ్ చేయలేదు... కానీ ఆసీస్ మీడియా ఇలాంటి వార్తలు సృష్టించి, ప్రచారం చేసింది...
undefined
సిడ్నీ టెస్టుకి ముందు భారత క్రికెటర్లు క్వారంటైన్ నిబంధనలు, కరోనా ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆరోపణలు కూడా వచ్చాయి... ఇవన్నీ మెల్‌బోర్న్ టెస్టు తర్వాతే ఎందుకు వచ్చాయో ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది...
undefined
ఆస్ట్రేలియా పేసర్లు కావాలనే మా బాడీలనే టార్గెట్ చేస్తూ బంతులు వేశారు... అవుట్ కాకపోతే రిటైర్డ్ హార్ట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి బౌలింగ్‌కి వచ్చారు... కానీ మేం ఆ ఛాన్స్ ఇవ్వలేదు...
undefined
గబ్బా టెస్టుకి ముందు తప్పకుండా సిరీస్ గెలుస్తామనే ధీమాలో ఉంది ఆస్ట్రేలియా... కానీ సిడ్నీ రిజల్ట్ వారిని మానసికంగా దెబ్బతీసింది... అందుకే రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆలౌట్ అయ్యేదాకా డిక్లేర్ చేయడానికి ఆస్ట్రేలియా ఇష్టపడలేదు..
undefined
గబ్బాలో భారత జట్టు సాధించిన విజయం ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చి ఉంటుంది.. కానీ నాకు ఇప్పుడు టిమ్ పైన్ చాలా నచ్చుతున్నాడు. ఈ టెస్టు సిరీస్ ద్వారా భారత జట్టులో మంచి ఉత్సాహం నింపాడు అతను...
undefined
భారత జట్టు రిజర్వు బెంచ్‌లో ఎంత బలం ఉందో ప్రపంచానికి అర్థమైంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు రవచంద్రన్ అశ్విన్...
undefined
బ్రిస్బేన్‌లో భారత జట్టుకి ఆంక్షలు సడలించాలని టీమిండియా డిమాండ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించిన క్వీన్స్‌ల్యాండ్ మంత్రి... ‘నిబంధనల ప్రకారం ఆడలేకపోతే... ఇక్కడికి రాకండి’ అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే..
undefined
బ్రిస్బేన్‌లో హోటల్ గదుల నుంచి కూడా బయటికి రాకుండా ఆంక్షలు విధించారని, ఆఖరికి బాత్రూంలు కూడా మేమే క్లీన్ చేసుకోవాల్సి వస్తోందని... ఓ భారత క్రికెటర్ వాపోయిన విషయం తెలిసిందే...
undefined
టీమిండియాతో టెస్టు సిరీస్ ఓడిపోవడానికి ఆస్ట్రేలియా చేసిన చిన్న పొరపాటే కారణమని అన్నాడు భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్...
undefined
మిచెల్ స్టార్క్, హజల్‌వుడ్, కమ్మిన్స్, నాథన్ లియాన్‌కి ఉన్న అపార అనుభవంతో ఈ నలుగురు పేసర్లనే నమ్ముకుంది ఆస్ట్రేలియా... ఇదే ఆసీస్ ఓటమికి కారణం అంటూ వ్యాఖ్యానించాడు ఆర్. శ్రీధర్...
undefined
click me!