ఎలాంటి ప్రెషర్ లేదన్నారు... ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేక పోయారు...

First Published Jun 23, 2021, 8:28 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు పర్ఫామెన్స్ చూసిన తర్వాత... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్ కూడా కాస్త ఒత్తిడికి గురైంది. కానీ మ్యాచ్ ఆరంభమయ్యాక కానీ మనోళ్ల పర్ఫామెన్స్ గురించి వారికి కాస్త క్లారిటీ రాలేదు...

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడి, సిరీస్ గెలిచి ఆ ఊపుతో ఫైనల్‌లో అడుగుపెట్టింది న్యూజిలాండ్. ఆ జోరు న్యూజిలాండ్‌కి అడ్వాంటేజ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు...
undefined
అయితే ఫైనల్‌లో వారికి ఆ అడ్వాంటేజ్ కంటే మనోళ్లు ఫైనల్ ఆడుతున్నామనే ఒత్తిడికి గురై ఇచ్చిన పర్ఫామెన్సే డబుల్ బోనస్ ఇచ్చినట్టు అయ్యింది...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు తరుపున ఒక్క ప్లేయర్ కూడా హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో రహానే కొట్టిన 49 పరుగులే అత్యధికం.
undefined
చివరిసారిగా లార్డ్స్ మైదానంలో 2018లో ఇంగ్లాండ్‌పై ఇలాంటి చెత్త రికార్డు నమోదుచేసిన టీమిండియా, మళ్లీ సౌంతిప్టన్‌లోనే ఈ చెత్తరికార్డును నమోదుచేసింది.
undefined
ఈ రెండు టెస్టుల మధ్య 26 టెస్టులు ఆడింది టీమిండియా.. ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా నమోదుచేస్తూ వచ్చింది. ఫైనల్‌లో టీమిండియా పర్ఫామెన్స్ మరీ అంత దారుణంగా ఏమీ లేదు...
undefined
అయితే ఆసీస్ టూర్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ విజయాల తర్వాత ఫ్యాన్స్, టీమిండియా నుంచి భారీగా ఆశించారు. అయితే ఎప్పటిలాగే మనోళ్లు ఫైనల్ ఫియర్‌తో ఆ రేంజ్ అంచనాలను ‘మగధీర’ తర్వాత ‘ఆరెంజ్’ మూవీలా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చేసేశారు.
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అజింకా రహానే, రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చెరో 64 పరుగులు చేయగా, కోహ్లీ 57, రిషబ్ పంత్ 45, శుబ్‌మన్ గిల్ 36, జడేజా 31 పరుగులు చేశారు...
undefined
అశ్విన్ 29 పరుగులు చేయగా, టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ‘నయా వాల్’ పూజారా 23 పరుగులే చేయగలిగాడు. షమీ 17 పరుగులు చేయగా, ఇషాంత్ శర్మ 5 పరుగులు చేశాడు.
undefined
బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులేమీ చేయకపోగా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ తీయలేకపోయాడు. బుమ్రా నుంచి బ్యాటింగ్ ఎప్పుడూ జట్టు ఆశించింది లేదు. అయితే బుమ్రా, బుమ్రాలా బాల్‌తో పర్ఫామెన్స్ ఇచ్చి ఉండి ఉంటే... భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో కచ్ఛితంగా ఆధిక్యం దక్కి ఉండేది...
undefined
న్యూజిలాండ్‌ టెయిలెండర్లు ఆఖరి ఐదు వికెట్లకు 114 పరుగులు జతచేశారు. అదే సమయంలో టీమిండియా టెయిలెండర్లు తొలి ఇన్నింగ్స్‌లో 61, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు జత చేశారు.
undefined
ఈ తేడాయే ఇరుజట్ల పర్ఫామెన్స్‌కి మధ్య భారీ వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది. న్యూజిలాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం దక్కకపోయి ఉంటే, వారి విజయలక్ష్యం 170 పరుగులకి పైగా ఉండేది...
undefined
55 ఓవర్లలో దాన్ని చేధించడం అంటే ఏ జట్టు అయినా ఒత్తిడికి గురయ్యేది. కానీ అలా జరగలేదు. అదీకాకుండా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత బౌలర్లు చేసిన ఆలస్యం కూడా టీమిండియాని నష్టపరిచింది.
undefined
రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ చేసిన 41 పరుగులు కూడా లేకపోయిఉంటే, న్యూజిలాండ్ టార్గెట్ 100లోపే ఉండేది. అప్పుడు మ్యాచ్ వన్‌సైడ్ అయిపోయేది. పంత్, రహానే రాణించినా... అనవసర షాట్లకి వెళ్లి వికెట్లు పారేసుకున్నారు.
undefined
click me!