రిషబ్ పంత్ ఒంటరిపోరు... రెండో ఇన్నింగ్స్‌లో తడబడ్డ టీమిండియా... న్యూజిలాండ్ ముందు...

Published : Jun 23, 2021, 07:11 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. అసలే రిజర్వు డే, టీమిండియా చేతిలో 8 వికెట్లు ఉండడంతో అసలు ఫలితం తేలుతుందా? లేదా? అనుకున్న మ్యాచ్‌ను న్యూజిలాండ్ బౌలర్లు మలుపు తిప్పేశారు...

PREV
18
రిషబ్ పంత్ ఒంటరిపోరు... రెండో ఇన్నింగ్స్‌లో తడబడ్డ టీమిండియా... న్యూజిలాండ్ ముందు...

ఓవర్‌నైట్ స్కోరు 64/2 వద్ద ఆరో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... తొలి సెషన్‌లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 బంతుల్లో 13 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని, జెమ్మీసన్ అవుట్ చేశాడు. 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా...

28

ఆ తర్వాత కొద్దిసేపటికే 80 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా కూడా జెమ్మీసన్ బౌలింగ్‌లోనే రాస్ టేలర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

38

ఆ తర్వాత రిషబ్ పంత్, అజింకా రహానే కలిసి ఐదో వికెట్‌కి 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 40 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన రహానేని ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. 109 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

48

ఆ తర్వాత రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ కలిసి ఆరో వికెట్‌కి 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 49 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన జడేజా, వాగ్నర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 142 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు.

58

ఓ వైపు వికెట్లు పడుతున్నా తనదైన స్టైల్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 88 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

68

అయితే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి యత్నించిన రిషబ్ పంత్, హెన్రీ నికోలస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, 7 పరుగులు చేసిన అశ్విన్ కూడా అదే ఓవర్‌లో అవుట్ అయ్యాడు...

78

వస్తూనే మూడు ఫోర్లు బాదిన మహ్మద్ షమీ, 9 బంతుల్లో 13 పరుగులు చేశాడు. అయితే అదే జోరు కొనసాగించబోయి సౌథీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

88

అదే ఓవర్‌లో బుమ్రా డకౌట్ కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 170 పరుగులకి ఆలౌట్ అయ్యింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలవాలంటే న్యూజిలాండ్ 55 ఓవర్లలో 138 పరుగులు చేయాల్సి ఉంటుంది. 

click me!

Recommended Stories