మూడో వన్డేలో టీమిండియా ఉత్కంఠ విజయం... వన్డే సిరీస్ కూడా మనదే...

First Published Mar 28, 2021, 10:28 PM IST

నరాలు తెగే ఉత్కంఠ... భారత జట్టు ఈజీగా గెలుస్తుందనే స్టేజ్ నుంచి మ్యాచ్ ఫలితం కోసం ఆఖరి ఓవర్‌ దాకా వేచి చూడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు... 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత అలాంటి మజాని అందించింది ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన మూడో వన్డేలో 7 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా... 2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకుంది. 

257 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ప్రత్యర్థి జట్టుకి విజయానికి ఇంకా 73 పరుగులు కావాలి. భారత జట్టు గెలవాలంటే రెండు వికెట్లు తీస్తే చాలు... భారత జట్టు ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా. ప్రత్యర్థి జట్టు కూడా విజయంపై ఆశలు వదిలేసుకుంది కానీ సామ్ కుర్రాన్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌లో అద్భుతమే చేశాడు...
undefined
330 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు... 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 322 పరుగులకి పరిమితమైంది. 95 పరుగులు చేసిన సామ్ కుర్రాన్, అద్భుత పోరాటంతో ఆకట్టుకున్నాడు.
undefined
మొదటి ఓవర్, మొదటి ఐదు బంతుల్లో మూడు ఫోర్లు బాది 14 పరుగులు రాబట్టిన జాసన్ రాయ్‌ని ఆఖరి బంతికి అవుట్ చేశాడు భువీ... 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.
undefined
గత రెండు మ్యాచుల్లో భారీ స్కోర్లు చేసిన జానీ బెయిర్ స్టో, 4 బంతుల్లో ఒకే పరుగు చేసి అవుట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు బెయిర్ స్టో...
undefined
వస్తూనే హిట్టింగ్ మొదలెట్టిన బెన్ స్టోక్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను హార్ధిక్ పాండ్యా జారవిడిచాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌ను నటరాజన్ అవుట్ చేశాడు. 68 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...
undefined
తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న జోస్ బట్లర్ మరోసారి నిరుత్సాహపరిచాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేల్లో మొదటిసారి డబుల్ డిజిట్ స్కోరు చేసిన బట్లర్ 18 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
undefined
డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్ కలిసి ఐదో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 31 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
50 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన వన్డే కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్ మలాన్ కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
168 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మొయిన్ ఆలీ 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
undefined
200 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను అదిల్ రషీద్‌తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేశాడు సామ్ కుర్రాన్... ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కి 57 పరుగులు జోడించారు...
undefined
ఈ దశలో మరోసారి సామ్ కుర్రాన్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు హార్ధిక్ పాండ్యా.. 22 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన అదిల్ రషీద్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
ఆ తర్వాత మార్క్‌ వుడ్‌తో కలిసి అద్భుతంగా పోరాడాడు సామ్ కుర్రాన్. ఇదే సమయంలో భారత ఫీల్డర్లు చేతుల్లోకి వచ్చిన క్యాచులను జారవిడవడంతో మార్క్ వుడ్, సామ్ కుర్రాన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు...
undefined
45 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సామ్ కుర్రాన్. సామ్ కుర్రాన్‌కి వన్డేల్లో ఇది తొలి హాఫ్ సెంచరీ...ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ విజయానికి 14 పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికి వుడ్ డకౌట్ అయ్యాడు. ఓవర్‌లో కేవలం 6 పరుగులిచ్చిన నటరాజన్, భారత జట్టుకి విజయాన్ని అందించాడు.
undefined
83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 పరుగులు చేసిన సామ్ కుర్రాన్ నాటౌట్‌గా నిలవగా భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 3, నటరాజన్ ఓ వికెట్ తీశారు..
undefined
click me!