ఐపీఎల్‌లో ఆ వివాదాస్పద రూల్ తొలగింపు... థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేస్తే...

First Published Mar 28, 2021, 7:00 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చే ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నిబంధన ప్రకారం... థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేసిన అవుట్‌పై, ఎలాంటి క్లారిటీ రాకపోతే, ఆన్‌ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయమే ఫైనల్ అవుతుంది...

సాఫ్ట్ సిగ్నల్ రూల్ కారణంగానే డేవిడ్ మలాన్ పట్టిన క్యాచ్, నేలను తాకుతున్నట్టు టీవీ రిప్లైలో కనిపించినా, అవుట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.
undefined
అలాగే మొదటి బంతికే ఫోర్ బాదిన వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాతి బంతికి సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో బౌండరీ లైన్ దగ్గర అదిల్ రషీద్ క్యాచ్ పట్టాడు.
undefined
అయితే టీవీ రిప్లైలో రషీద్ క్యాచ్ అందుకుంటున్న సమయంలో అతని కాలు, బౌండరీ లైన్‌కి తాకుతున్నట్టు కనిపించింది.
undefined
అయితే సుందర్ విషయంలోనూ ఈ సాఫ్ట్ సిగ్నల్ నిబంధనే అవుట్ ఇవ్వడానికి కారణమైంది. ఈ రెండు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం కావడంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో ‘సాఫ్ట్ సిగ్నల్’ రూల్‌ను తొలగించింది బీసీసీఐ...
undefined
బ్యాట్స్‌మెన్ అవుట్ లేదా నాటౌట్‌ అనే విషయంలో క్లారిటీ లేనప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వడానికి వీలులేదు. ఒకవేళ అంపైర్ ఇచ్చినా, థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేస్తే దాన్ని లెక్కలోకి తీసుకోరు...
undefined
ఐపీఎల్‌లో సాఫ్ట్ సిగ్నల్ రూల్‌ను తొలగించడంతో ఐసీసీ కూడా దీని గురించి సమీక్షించనుంది. త్వరలోనే అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ, ‘సాఫ్ట్ సిగ్నల్’తో పాటు ‘అంపైర్స్ కాల్స్’ నిర్ణయాలపై కూడా రివ్యూ చేయనుంది.
undefined
అలాగే ఇన్నాళ్లు నో బాల్‌ను మాత్రమే గుర్తించి, సైరన్‌తో హెచ్చరించిన థర్డ్ అంపైర్... ఇకపై షార్ట్ రన్‌ను కూడా గుర్తించనున్నాడు. ఒకవేళ షాట్ రన్ తీస్తే, దాన్ని గుర్తించి ఆ పరుగును తొలగించే అధికారం టీవీ అంపైర్‌కి ఉంటుంది...
undefined
గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రన్ పూర్తి చేసినా ఆన్ ఫీల్డ్ అంపైర్ షాట్ రన్‌గా ప్రకటించడంతో ఆ మ్యాచ్‌లో నష్టపోయింది పంజాబ్...
undefined
ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌ టైగా ముగిసి, సూపర్ ఓవర్‌కి దారి తీసి, ఢిల్లీ విజయం అందుకుంది. మయాంక్ అగర్వాల్ తీసిన 2 పరుగులను షాట్ రన్‌గా పరిగణించకపోయి ఉంటే పంజాబ్ గెలిచి ఉండేది.
undefined
click me!