ఐపీఎల్‌లో హార్ధిక్ బౌలింగ్ వేసినప్పుడు, టీమిండియాకి వేస్తే ఏంటి? - సునీల్ గవాస్కర్

First Published Mar 28, 2021, 8:51 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో స్పిన్నర్లు ఘోరంగా ఫెయిల్ అవుతున్నా, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి బౌలింగ్ ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు రేగాయి. అయితే పాండ్యాకి బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదే చెబుతూ కోహ్లీ ఇచ్చిన వివరణపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు..

రెండో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 336 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే భారత బౌలర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్‌కి సునాయాస విజయం దక్కింది...
undefined
బెయిర్ స్టో సెంచరీ, బెన్ స్టోక్స్ 99, జాసన్ రాయ్ 55 పరుగులు చేయడంతో 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది ఇంగ్లాండ్... భారత స్పిన్నర్లు ఘోరంగా విఫలమయ్యారు...
undefined
కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 84 పరుగులు ఇవ్వగా కృనాల్ పాండ్యా 6 ఓవర్లలో 72 పరుగులు సమర్పించుకున్నాడు.
undefined
స్పిన్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బౌండరీలు బాదుతున్నా, మరో ఆప్షన్ లేనట్టుగా వారితోనే బౌలింగ్ చేయించాడు కోహ్లీ...
undefined
భారత జట్టులో ఉన్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు బౌలింగ్ ఇవ్వలేదు. ‘హార్ధిక్ పాండ్యా బాడీపైన ఒత్తిడి పడకుండా ఉండేందుకే అతనికి బౌలింగ్ ఇవ్వలేదు... భారత జట్టు మున్ముందు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు బిజీ షెడ్యూల్ ఆడాలి’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
‘వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ అనేది మంచిదే. ఆటగాళ్లపై వర్క్ లోడ్ పడకుండా చేసుకోవడం కెప్టెన్ బాధ్యత. కానీ టెస్టు ఛాంపియన్‌షిప్ ముందు పాండ్యా, ఐపీఎల్ ఆడతాడు...
undefined
ఐపీఎల్‌లో అతనితో కచ్ఛితంగా బౌలింగ్ చేయిస్తారు... అయినా పూర్తిగా 10 ఓవర్లు బౌలింగ్ చేస్తే హార్ధిక్ పాండ్యాపై ఒత్తిడి పడుతుందేమో... కానీ ఓ మూడు, నాలుగు ఓవర్లు వేయించినా సరిపోయేది కదా...
undefined
హార్ధిక్ పాండ్యా భారత జట్టు ఆల్‌రౌండర్. బౌలింగ్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు అతన్ని వినియోగించుకోవాలి... 20 బంతులు కూడా ఆడని హార్ధిక్ పాండ్యా, నాలుగు ఓవర్లు వేస్తే అలిసిపోతాడా’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
undefined
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే విధంగా స్పందించాడు. ‘కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా భారీగా పరుగులు సమర్పించాక కృనాల్ పాండ్యాతో ఓ రెండు ఓవర్లు వేయిస్తే, అతనిపై వర్క్ లోడ్ పడుతుందా?’ అంటూ ప్రశ్నించాడు వీరూ...
undefined
click me!