మొదటి వన్డేలో టీమిండియా ఓటమి... కెప్టెన్ మిథాలీరాజ్ రికార్డు ఫీట్ వృథా...

First Published Jun 28, 2021, 11:00 AM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో అద్భుతమైన పోరాటం చూపించిన భారత మహిళా జట్టు, తొలి వన్డేలో తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఫెయిల్ అయి, 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. టీనేజ్ సెన్సేషన్ ఓపెనర్ షెఫాలీ వర్మ 14 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి అవుట్ అయ్యింది...
undefined
స్టార్ ఓపెనర్ స్మృతి మందాన 25 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేయగా పూనమ్ రౌత్ 61 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 7 బంతులాడి 1 పరుగుకే అవుట్ అయ్యింది.
undefined
దీప్తి శర్మ 46 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేయగా, కెప్టెన్ మిథాలీరాజ్ 108 బంతుల్లో 7 ఫోర్లతో 72 పరుగులు చేసింది.
undefined
కెరీర్‌లో 56వ వన్డే హాఫ్ సెంచరీ సాధించిన మిథాలీరాజ్, మహిళల క్రికెట్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ప్లేయర్‌గా తన రికార్డును మెరుగుపర్చుకుంది.
undefined
భారత జట్టు ఇన్నింగ్స్‌లో 181 డాట్ బాల్స్ ఉండగా, ఇంగ్లాండ్ జట్టు ఈ లక్ష్యాన్ని 199 బంతుల్లోనే చేధించింది. విన్‌ఫీల్డ్ హిల్ 16, హేతర్ నైట్ 18 పరుగులు చేసి అవుటైనా టమ్మీ బేమోంట్ 87 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 87 పరుగులు చేయగా, నటాలీ సీవర్ 74 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
undefined
మూడు వన్డేల సిరీస్‌లో 0-1 తేడాతో వెనకంజలో ఉన్న టీమిండియా సారథి మిథాలీరాజ్, స్ట్రైయిక్ రొటేషన్ చేయడంతో తాము విఫలమయ్యామని, తర్వాతి మ్యాచ్‌లో మార్పులు ఉంటాయని పేర్కొంది...
undefined
click me!