ఇప్పటికీ ఆ విషయంలో విరాట్ కోహ్లీయే టాప్... కేన్ విలియంసన్ కంటే చాలా దూరంలో...

First Published Jun 28, 2021, 10:28 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో భారత సారథి విరాట్ కోహ్లీపై ట్రోల్స్ పెరుగుతున్నాయి. అయితే భారత సారథి విరాట్ కోహ్లీ ఇప్పటికీ చాలా విషయాల్లో మిగిలిన ప్లేయర్ల కంటే చాలా ముందున్నాడు... 

ప్రస్తుత తరంలో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీయే. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 12,400 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు..
undefined
విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఉన్నాడు. కేన్ విలియంసన్ కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 7996 పరుగులు చేశాడు. 8 వేల పరుగులకు చేరువలో ఉన్న కేన్ మామ కంటే ‘కింగ్’ కోహ్లీ 4400 పరుగుల ముందుండడం విశేషం...
undefined
శ్రీలంక కెప్టెన్ ఏంజులో మాథ్యూస్ 6356 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 5885 పరుగులు.. ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 5655 పరుగులతో ఉన్నారు...
undefined
అలాగే ప్రస్తుత తరంలో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీయే. విరాట్ తన కెరీర్‌లో 57 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
undefined
వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్, ‘యూనివర్సల్ బాస్’ 41 ఏళ్ల క్రిస్ గేల్ తన కెరీర్‌లో 40 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని రెండో స్థానంలో ఉన్నాడు...
undefined
భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ 34 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలవగా, బంగ్లా ఆల్‌రౌండర్ షకీల్ అల్ హసన్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చెరో 33 సార్లు ఈ అవార్డు సాధించారు...
undefined
click me!