ఆరేళ్ల తర్వాత తొలి టెస్టు ఆడనున్న టీమిండియా... జూన్‌లో ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్...

First Published Apr 13, 2021, 5:38 PM IST

భారత పురుషుల జట్టు, టెస్టులు, వన్డేలు, టీ20లు, ఐపీఎల్... ఇలా యమా బిజీ క్రికెట్ షెడ్యూల్‌లో గడుపుతుంటే... భారత మహిళా జట్టుకి మాత్రం పెద్దగా క్రికెట్ ఆడేందుకు అవకాశం దక్కడం లేదు. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాతో జరగాల్సిన సిరీస్ కూడా కరోనా కారణంగా రద్దయిన విషయం తెలిసిందే...

గత నెలలో సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్ ఆడిన టీమిండియా, జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...
undefined
ఇప్పటిదాకా పెద్దగా టెస్టు మ్యాచులు ఆడని టీమిండియా, ఆరేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడనుంది. చివరిసారిగా సౌతాఫ్రికాతో 2014 నవంబర్ 16న టెస్టు మ్యాచ్ ఆడింది భారత మహిళా జట్టు...
undefined
జూన్ 16 నుంచి 19 వరకూ బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. నాలుగు రోజుల ఈ టెస్టుతో మళ్లీ టెస్టుల్లోనూ భారత మహిళల జట్టును యాక్టీవ్‌గా ఉంచాలని భావిస్తోంది బీసీసీఐ...
undefined
ఇప్పటిదాకా 36 టెస్టు మ్యాచులు ఆడిన భారత జట్టు 5 మ్యాచుల్లో గెలిచి 6 మ్యాచుల్లో ఓడింది. 25 మ్యాచులు డ్రాగా ముగిశాయి.
undefined
మిథాలీరాజ్ కెప్టెన్సీలో గత మూడు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా, ఇంకో టెస్టు గెలిస్తే వరుసగా అత్యధిక టెస్టులు గెలిచిన మహిళా జట్టుగా నిలుస్తుంది...
undefined
టెస్టు మ్యాచ్‌లో పాటు ఇంగ్లాండ్‌తో జూన్ 27, 30, జూలై 3న మూడు వన్డేలు... అలాగే జూన్ 9, 11, 15 తేదీల్లో టీ20 మ్యాచులు ఆడనుంది భారత మహిళా జట్టు...
undefined
టీమిండియా మహిళా జట్టుకి వన్డేల్లో మిథాలీరాజ్, టీ20 మ్యాచుల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్లుగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే...
undefined
వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ సక్సెస్ కావడంతో త్వరలోనే పూర్తిస్థాయిలో వుమెన్స్ ఐపీఎల్ టోర్నీ నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ.
undefined
click me!