Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ బెస్ట్ మూమెంట్స్ !

Published : Mar 10, 2025, 07:58 AM IST

ICC Champions Trophy 2025: భారత్ (Indian Cricket Team) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025) గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బెస్ట్ మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం !

PREV
114
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ బెస్ట్ మూమెంట్స్ !

Champions trophy 2025 final best moments: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో (ICC Champions Trophy 2025 Final) భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (IND vs NZ) పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి 4 వికెట్ల తేడాతో భారత్ గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. 

214

టాస్ గెలిచి బ్లాక్‌క్యాప్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదట్నుంచీ వాళ్ల ఇన్నింగ్స్ తడబడింది. వాస్తవానికి, వాళ్లు నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అలాగే, భారత బౌలింగ్ అద్భుతంగా ఉండటంతో న్యూజిలాండ్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. ఇది భారత్ కు కలిసివచ్చింది. 

314

భారత బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో వారి రన్ రేటు కూడా బాగా తగ్గిపోయింది. రచిన్ రవీంద్ర మంచి అరంభం అందించినా.. విల్ యంగ్, కేన్ విలియమ్సన్ వికెట్లు పడటంతో న్యూజిలాండ్ కష్టాలు పెరిగాయి. 

414

డారిల్ మిచెల్ కాస్త పోరాటం చేశాడు. కానీ, అతను చాలా బంతులు తీసుకున్నాడు. దీంతో స్కోర్ బోర్డు బాగా తగ్గిపోయింది. మిచెల్ 63 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరలో బ్రేస్‌వెల్ కూడా 53 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. భారత్ ముందు 252 పరుగుల టార్గెట్ ను ఉంచింది. 

514

భారత్ కు ఇది పెద్ద టార్గెట్ కాదు కానీ, పిచ్ పరిస్థితులు కాస్త ఆందోళన కలిగించాయి. కానీ, ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ భారత్ న్యూజిలాండ్ బౌలింగ్ పై ఒత్తిడి పెంచింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట్నుంచీ చెలరేగి ఆడాడు. 76 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. 

614

శుభ్‌మన్ కూడా బాగా సహకరించాడు. అతను 31 పరుగులు చేశాడు. ఒక వైపు రోహిత్ శర్మ దంచికొడుతుంటే మరోవైపు గిల్ తనదైన షాట్స్ ఆడుతూ రోహిత్ కు స్ట్రైక్ అందించాడు. గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ లో కళ్లు చెదిరే క్యాచ్ తో గిల్ ను పెవిలియన్ కు పంపాడు. 

714

భారత్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ భారత్ గెలుపులో కీలకమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. అక్షర్ పటేల్ తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యం అందించాడు. ఈ గెలుపులో శ్రేయస్ అయ్యర్ పాత్ర కూడా ఉంది. అయ్యర్ 48 పరుగులు, అక్షర్ పటేల్ 29 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. 

814

ఒకానొక సమయంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో బ్లాక్‌క్యాప్స్ భారత్ పై కాస్త ఒత్తిడి తెచ్చారు. గిల్ అవుట్ అయిన తర్వాత కోహ్లీ రెండు బంతులు ఆడి పెవిలియన్ కు చేరాడు. అలాగే, రోహిత్, అక్షర్, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా మంచి టైమ్ లో అవుట్ కావడంతో కాస్త ఉత్కంఠను పెంచింది. అయితే,  కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. 

914

ఈ మ్యాచ్ లో  కేఎల్ రాహుల్ గురించి చెప్పకుండా ఉండలేం. ఎందుకంటే అతను అవసరమైన సమయంలో క్రీజులోకి వచ్చి తనను తాను నిరూపించుకున్నాడు. అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఫైనల్ లో కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ లోని 34 పరుగులు (నాటౌట్) చరిత్రలో నిలిచిపోతాయి. చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు.

1014

భారత విక్టరీలో జడేజా 9 పరుగులతో, హార్దిక్ 18 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. చివరకు భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. మూడో సారి ఛాంపియన్ గా నిలిచింది. 

1114

ఈ గెలుపుతో టీమ్ ఇండియాకు వరుసగా రెండు మెగా ఐసీసీ ట్రోఫీలు అందాయి. కేవలం 10 నెలల వ్యవధిలోనే భారత్ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకుంది. అంతకుముందు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. దీంతో టీమిండియా క్రికెట్ అభిమానులు సంతోషంగా ఉన్నారు.

1214

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ కావడంతో అందరి కళ్లు మ్యాచ్ మీదే ఉన్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్లపై మ్యాచ్ ను ప్రదర్శించారు. కేవలం స్టేడియం, టీవీల ముందే కాకుండా అనేక థియేటర్లు, బహిరంగ ప్రాంతాల్లోని పెద్ద స్క్రీన్లపై మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. భారత్ గెలుపు సంబరాలు జరుపుకున్నారు. 

1314

ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ట్రోఫీ గెలిచింది. భారత్ మళ్లీ ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. క్రికెట్ లో తన పవర్ ఏంటో టీమిండియా ఈ విజయ యాత్రతో చూపించింది. 

1414

భారత్ గెలిచిన వెంటనే దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. గెలుపు ఆనందంలో అందరూ మునిగిపోయారు. తమదైన తరహాలో భారత ప్లేయర్లు డాన్సులు చేస్తూ గ్రౌండ్ లో గెలుపు సంబరాలు చేసుకున్నారు. అభిమానులు ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు, క్రాకర్స్ కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories