IND vs NZ: న్యూజిలాండ్ పై భారత్ గెలుపునకు 5 ముఖ్య కారణాలు!

Published : Mar 10, 2025, 07:25 AM IST

champions trophy 2025: న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి, 3వ సారి ఛాంపియన్‌గా నిలిచింది.

PREV
18
IND vs NZ: న్యూజిలాండ్ పై భారత్ గెలుపునకు 5 ముఖ్య కారణాలు!

India Beats New Zealand Top 5 Key Moments: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడానికి స్పిన్నర్లు ముఖ్య కారణం. అలాగే, రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ సహకారం, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా విన్నింగ్ మూమెంట్ అన్నీ కలిసొచ్చాయి. మొత్తంగా భారత్ గెలుపులో కీలకంగా టాప్ పాయింట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

28
భారత జట్టు ఐసీసీ ఈవెంట్లలో 3వ సారి ఛాంపియన్‌గా నిలిచింది

భారత్ vs న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కప్‌ను భారత్ గెలుచుకుంది. భారత జట్టు వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు అదరగొట్టారు. మొదట బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌లను ఆడేసుకున్నారు, తర్వాత బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. 6 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించేశారు.

38
భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్

ఈ విజయంతో మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ చేజిక్కించుకుంది. అంతేకాదు, రోహిత్ సారథ్యంలోని జట్టుకు 3వ సారి కప్పును ముద్దాడే అవకాశం వచ్చింది. మన భారత జట్టు ఛాంపియన్ కావడానికి కారణమైన ముఖ్యమైన మూమెంట్స్‌ను చాలానే ఉన్నాయి. 

48
భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్

వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు చిక్కిన కివీ బ్యాట్స్‌మెన్‌లు

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేశారు. కానీ, ఆ తర్వాత రోహిత్ శర్మ తన నమ్మకమైన వరుణ్ చక్రవర్తిని బౌలింగ్ చేయడానికి పిలిచాడు. అతను తన స్పిన్ మాయాజాలంతో విల్ యంగ్‌ను అవుట్ చేశాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.

58
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫామ్‌లో ఉన్న రచిన్, విలియమ్సన్ వికెట్‌ను తీసిన కుల్దీప్ యాదవ్

వరుణ్ మొదటి వికెట్ తీసిన తర్వాత మన భారత జట్టు కివీలపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు వచ్చి మొదటి బంతికే రచిన్ రవీంద్రను పెవిలియన్‌కు పంపించాడు. అంతేకాకుండా సెమీఫైనల్‌లో సెంచరీ కొట్టిన కేన్ విలియమ్సన్‌ను కూడా అవుట్ చేసి కీవీస్ టాప్ ఆర్డర్‌ను గడగడలాడించాడు.

68

మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు రన్స్ కట్టడి చేశారు

 భారత బౌలింగ్ దెబ్బకు కివీ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు పడటం ఆగనే లేదు. 10 నుంచి 40 ఓవర్ల వరకు వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. పెద్ద భాగస్వామ్యం లేకపోవడంతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు పెద్ద స్కోర్ చేయలేకపోయారు. ఇందులో మన బౌలర్లు గొప్పపనిచేశారు. 

78
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025

బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు

252 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చి బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. పవర్ ప్లేలో ఎప్పుడూ చేసేలాగే ఫైనల్‌లో కూడా అదే చేశాడు. రోహిత్ బ్యాట్ నుంచి 76 పరుగులు రావడంతో భారత జట్టుకు టార్గెట్ ఈజీ అయిపోయింది. రోహిత్ ఇన్నింగ్స్ తో భారత్ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది చెప్పవచ్చు. 

88
ఛాంపియన్స్ ట్రోఫీ 2025

శ్రేయాస్-అక్షర్ భాగస్వామ్యం.. రాహుల్, జడేజా అదిరిపోయే ఫినిషింగ్

ఒకానొక సమయంలో భారత జట్టు వరుసగా మూడు వికెట్లు కోల్పోయి తడబడుతూ ఉంది. కానీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్‌ను కాపాడి సూపర్ భాగస్వామ్యం నెలకొల్పారు. అయ్యర్ 48 పరుగులు చేయగా, అక్షర్ కూడా 29 పరుగులు చేశాడు. చివర్లో రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చి 33 బంతుల్లో 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించి భారత్‌ను గెలిపించి కప్పును అందించాడు.

Read more Photos on
click me!

Recommended Stories