రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో ఆరంభమైన ఇంగ్లాండ్ వికెట్ల పతనం, ఏ దశలోనూ కోలుకున్నట్టు కనిపించలేదు. 5 పరుగులు చేసిన జాక్ క్రావ్లేను అవుట్ చేసిన అశ్విన్, బెయిర్ స్టోను గోల్డెన్ డకౌట్ చేశాడు...

21 బంతుల్లో 3 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 2 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌ను కూడా అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్..

31 బంతుల్లో 15 పరుగులు చేసిన ఓల్లీ పోప్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికే 72 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేసిన జో రూట్‌ను, అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు...

65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును బెన్ ఫోక్స్, డానియల్ లారెన్స్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఏడో వికెట్‌కి 44 పరుగులు జోడించిన తర్వాత 13 పరుగులు చేసిన బెన్ ఫోక్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత డామినిక్ బెస్‌ను అవుట్ చేసిన అక్షర్ పటేల్, ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. మూడో టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్‌కి ఇది నాలుగో ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం...

111 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసిన డానియల్ లారెన్స్, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

2 పరుగులు చేసిన జాక్ లీచ్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో 134 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

94 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన లారెన్స్‌ను అవుట్ చేసిన అశ్విన్, టీమిండియాకు విజయాన్ని అందించాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన పూర్తి చేసుకున్నాడు.

మొదటి టెస్టులో 227 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని అందుకున్న టీమిండియా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది.

రెండో టెస్టులో 317 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా, మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

మొదటి మూడు టెస్టుల్లో నాలుగు సార్లు ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా నిలిచాడు అక్షర్ పటేల్.

నరేంద్ర హిరాణీ, శివరామకృష్ణన్ మూడేసి సార్లు, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ నిస్సర్ రెండేసి సార్లు ఈ ఫీట్ సాధించారు..