మొదటి మ్యాచ్ ఓడిపోవడం మనకి కొత్తేమీ కాదు! సిరీస్ మనదే... దినేశ్ కార్తీక్ కామెంట్...

First Published Dec 7, 2022, 10:36 AM IST

బంగ్లాదేశ్ పర్యటనను పరాజయంతో ప్రారంభించింది టీమిండియా... ఢాకాలో జరిగిన తొలి వన్డేలో ఆఖరి వికెట్ తీయలేక పరాజయాన్ని అందుకుంది... బ్యాటింగ్‌లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఫీల్డింగ్‌లోనూ టీమిండియా చేసిన తప్పులు, బంగ్లాకి బాగా కలిసి వచ్చాయి...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 186 పరుగులకే ఆలౌట్ అయినా భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది బంగ్లా. అయితే ఆఖరి వికెట్‌కి 51 పరుగులు జోడించిన బంగ్లా బ్యాటర్లు... సిరీస్‌లో 1-0 ఆధిక్యం అందించారు...
 

‘సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడిపోవడం, కమ్‌బ్యాక్ ఇవ్వడం మనకి కొత్తేమీ కాదు. లో స్కోరింగ్ గేమ్‌ని ఇంత ఇంట్రెస్టింగ్‌గా మార్చినందుకు బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. 186 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత బౌలర్లే మ్యాచ్‌లో టీమిండియాకి అవకాశాలు క్రియేట్ చేయగలిగారు...

మొదటి 40 ఓవర్లు ముగిసే సమయానికి కూడా మ్యాచ్ మనదే. అంటే 80 శాతం పని కరెక్టుగా చేశారు. ఆఖర్లో కూడా బౌలింగ్ బాగానే ఉంది, ఫీల్డర్లే క్యాచ్ డ్రాప్ చేసి మ్యాచ్‌ని చేజార్చారు. ఇలాంటి లో- స్కోరింగ్ గేముల్లో ఫీల్డింగ్ టాప్ క్లాస్‌గా ఉండాలి. కీలక సమయాల్లో క్యాచులు అందుకోలేకపోవడం వల్లే మ్యాచ్ చేజారింది...

రోహిత్ శర్మ, బ్యాటర్లతో ఈ విషయం గురించి మాట్లాడాలి. వచ్చే రెండు మ్యాచుల్లో సీనియర్ల బ్యాటింగ్ పర్ఫామెన్స్‌పైనే టీమిండియా విజయం ఆధారపడి ఉంది. వన్డేల్లో కనీసం 300-320 పరుగుల స్కోరు చేయలేకపోతే మ్యాచ్‌లు గెలవడం కష్టం... 

Image credit: Getty

రెండు ప్రాక్టీస్ సెషన్లతో ప్లేయర్లు ఫామ్‌లోకి వచ్చేయడం జరగదు. అయితే ఒక్క మ్యాచ్ ఫెయిల్యూర్, ఏ బ్యాటర్ ఫామ్‌ని నిర్ణయించదు. ఎప్పటిలాగే భారత జట్టు కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్ గెలుస్తుందన్న నమ్మకం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. 

click me!