మిల్కా సింగ్‌కి నివాళిగా బ్లాక్ బ్యాడ్జిలతో టీమిండియా... సంతాపం తెలిపిన కోహ్లీ, సచిన్...

First Published Jun 19, 2021, 3:47 PM IST

కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన భారత మాజీ అథ్లెట్, లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్‌కి నివాళిగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు నల్ల బ్యాడ్జిలతో బరిలో దిగింది. 91 ఏళ్ల మిల్కా సింగ్‌ మరణానికి కొన్నిరోజుల ముందే ఆయన భార్య నిర్మలా కౌర్ కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు...

భారత మాజీ అథ్లెట్, లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్‌కి నివాళిగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు నల్ల బ్యాడ్జిలతో బరిలో దిగింది.
undefined
మిల్కా సింగ్‌ని నివాళి ఘటిస్తూ భారత సారథి విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. ‘దేశం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచిన ఆయన, ఆశయాల సాధనలో ఎప్పుడూ అలిసిపోయి ఆగిపోకూడదని తెలిపారు. మీ ఆత్మకి శాంతి కలగాలి మిల్కా సింగ్ జీ. మీరేప్పటికీ మన మదిలో నిలిచిపోతారు’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
‘రెస్ట్ ఇన్ పీస్ మా ఫ్లైయింగ్ సిక్ మిల్కా సింగ్ జీ. మీ మరణం ప్రతీ భారతీయుడి మనసును విషాదంలోకి తోసేసింది. మీరు ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...
undefined
‘మిల్కా సింగ్ మరణ వార్త విని షాక్‌కి గురయ్యాను. భారతదేశానికి దొరికిన గొప్ప స్పోర్ట్స్‌మ్యాన్ అతను. కుర్రాళ్లలో ఆటలపై ఆసక్తి పెంచారు మీరు... ’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...
undefined
‘ది గ్రేట్మ్యాన్ మిల్కా సింగ్ జీ... తన కాయాన్ని మాత్రమే వదిలేశారు. ఆయన పేరు ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. వాట్ ఏ మ్యాన్... మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
undefined
రోమ్‌లో జరిగిన 1960 ఒలింపిక్స్‌‌లో 400 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్‌కి చేరుకున్న మిల్కా సింగ్... ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలవడంతో మిల్లీ సెకన్ తేడాతో పతకాన్ని కోల్పోయారు.
undefined
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా నిలిచిన మిల్కా సింగ్, 1958లో ఈ రికార్డు సాధించారు.
undefined
‘ప్లైయింగ్ సిక్’గా గుర్తింపు తెచ్చుకున్న మిల్కా సింగ్... అనేక అవార్డులు దక్కించుకున్నారు. అయితే తన కెరీర్‌లో ఒలింపిక్ పతకం మాత్రం గెలవలేకపోయారు.
undefined
మిల్కా సింగ్ జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన ‘బాగ్ మిల్కా బాగ్’ 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ అని మిల్కా సింగ్ రాసిన జీవిత చరిత్ర పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.
undefined
click me!