తొలి పెళ్లిరోజుకు అందనంత దూరంలో కొత్త జంట.. సోషల్ మీడియాలో బుమ్రా-సంజనా భావోద్వేగ సందేశాలు

Published : Mar 15, 2022, 02:25 PM IST

Jasprit Bumrah-Sanjana Ganesan: దంపతులకు క్యాలెండర్ లో మిగిలిన రోజులు ఎలా గడిచినా తమ పెళ్లి రోజు మాత్రం ఎంతో ప్రత్యేకం.   ముఖ్యంగా కొత్తగా పెళ్లై తొలి పెళ్లి రోజు జరుపుకునే వారి గురించి చెప్పాలా..? అయితే టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం.. 

PREV
18
తొలి పెళ్లిరోజుకు అందనంత దూరంలో కొత్త జంట.. సోషల్ మీడియాలో బుమ్రా-సంజనా భావోద్వేగ సందేశాలు

వివాహ బంధంలో అడుగిడిన వారికి మొదటి వివాహ వార్షికోత్సవం ఎంతో ప్రత్యేకం.  వారి జీవితంలో ఎన్ని పెళ్లి రోజులు వచ్చినా.. దంపతులు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి  ఇచ్చే ఇంపార్టెన్సే వేరు.. 

28

పెళ్లి రోజు ఎన్ని పనులున్నా దంపతులిద్దరూ కలిసే ఉండాలని కోరుకుంటారు. సాయంత్రం పూట కాసేపు అలా బయటకు వెళ్లి ఎంజాయ్ చేయాలని  అనుకుంటారు. కానీ టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం అలా కాదు. 

38

తొలి పెళ్లి రోజును ఈ టీమిండియా పేసర్ ఒంటరిగానే జరుపుకుంటున్నాడు.  ప్రముఖ  క్రీడా యాంకర్ సంజనా గణేషన్ ను బుమ్రా గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 మార్చి 15న పూణెలో బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. 

48

నేటితో వీరి వివాహ బంధానికి ఏడాది పూర్తైంది. అయితే ఈ వేడుకను కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి బుమ్రా-సంజనాలు ఒక్కచోట లేరు. మహిళల ప్రపంచకప్ ను కవర్ చేసేందుకు గాను ప్రస్తుతం ఆమె న్యూజిలాండ్ లో ఉంది. 

58

ఇక బుమ్రా.. లంకతో టెస్టులు ముగించుకుని  ఐపీఎల్ కోసం నేరుగా ముంబై ఇండియన్స్ తో జతకలిశాడు. దీంతో ఈ ఇద్దరూ  సోషల్ మీడియా వేదికగా  ఒకరికొకరు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 

68

ఈ సందర్భంగా బుమ్రా స్పందిస్తూ.. ‘మనిద్దరం కలిసుంటే జీవితం నిండుగా అనిపిస్తుంది. నావెంట నువ్వు ఉంటే సంతోషం. నువ్వు నన్ను మరింత  సంతోషమైన వ్యక్తిగా.. దయా హృదయుడిగా.. శాంతస్వభావుడిగా మార్చావు. ఇద్దరం కలిసి మన జీవితాలను అర్థవంతంగా మార్చుకున్నాం. 

78

ఈ ప్రయాణంలో ఏడాది కాలమనేది చాలా చిన్నది. ఏ కాస్త సమయం దొరికినా నీతో గడపాలని కోరుకుంటాను..’ అని బుమ్రా ఇన్స్టా వేదికగా పోస్టు చేశాడు.  అంతేగాక  సతీమణికి పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలిపాడు. 

88

ఇదిలాఉండగా.. సంజనా గణేషన్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘హ్యాపీ యానివర్సరీ.. ఈ వేడుకను జరుపుకోవడానికి నేనెంతగానో  ఉత్సాహంగా ఉన్నాను. కేక్ నాకు.. ముద్దులు నీకు.. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ..’అని రాసుకొచ్చింది. 

click me!

Recommended Stories