మేం ఆ రూల్స్ మారిస్తే ఐపీఎల్ ఆడడానికి ఎవ్వరూ రారు, పీఎస్‌ఎల్ ముందు... రమీజ్ రాజా కామెంట్స్...

Published : Mar 15, 2022, 01:23 PM IST

ఐపీఎల్‌లో రిటైన్ చేసుకున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు చెల్లించే మొత్తం కంటే పాక్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌)లో టాప్ ప్లేయర్లకు చెల్లించే మొత్తం చాలా తక్కువ. అయితే పీఎస్‌ఎల్‌లో ఓ రూల్ మారిస్తే, ఐపీఎల్‌కి క్రేజ్ పడిపోతుందని అంటున్నాడు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ రమీజ్ రాజా...

PREV
110
మేం ఆ రూల్స్ మారిస్తే ఐపీఎల్ ఆడడానికి ఎవ్వరూ రారు, పీఎస్‌ఎల్ ముందు... రమీజ్ రాజా కామెంట్స్...

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కాంట్రాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని, పీఎస్ఎల్ 2022 సీజన్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు ఆసీస్ ప్లేయర్ జేమ్స్ ఫాల్కనర్...

210

అంతకుముందు పాక్ సూపర్ లీగ్‌లో తనకి ఇచ్చిన ఫుడ్‌లో కుళ్లిపోయిన గుడ్ ఉండడాన్ని చూసి షాక్ అయ్యాడు అలెక్స్ క్యారీ... తినడానికి ఇది ఇచ్చారంటూ సోషల్ మీడియాలో గోడు వెళ్లబోసుకున్నాడు..

310

ప్రస్తుతం పాకిస్తాన్‌ టూర్‌లో ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న మార్నస్ లబుషేన్... డిన్నర్‌గా మళ్లీ చపాతీ, పప్పు ఇచ్చారంటూ పోస్టు చేసిన ఫోటో చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు...

410

జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇచ్చే ఫుడ్ కంటే దారుణంగా ఏ మాత్రం నాణ్యత లేని ఆహారాన్ని ఆసీస్ ప్లేయర్లకు అందచేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు...

510

‘మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె పెట్టిస్తానని బీరాలు పోయినట్టుగా... తమ దేశంలో ఆడడానికి వచ్చిన ప్లేయర్లకు సరైన ఆహారం, ఆధిత్యం ఇవ్వలేకపోయినా ఐపీఎల్‌ను దాటేస్తామని బడాయి కబుర్లు మాత్రం బోలెడు చెబుతున్నాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

610

‘పీఎస్‌ఎల్‌ను వేలం మోడల్‌లోకి మార్చి, ఫ్రాంఛైజీల పర్సు విలువను పెంచితే.. ఐపీఎల్‌ ఇప్పుడున్న క్రేజ్ పూర్తిగా పడిపోతుంది...

710

పీఎస్‌ఎల్‌లో డబ్బులకు డబ్బులు, క్వాలిటీ క్రికెట్ దొరుకుతుంటే ఐపీఎల్ ఆడడానికి ఎవరు వెళ్తారు...’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ కెప్టెన్ రమీజ్ రాజా.

810

వరల్డ్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో ఒకటిగా ఉన్న ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను పోల్చుకోవడానికి కూడా కాస్త సిగ్గు ఉండాలని అంటున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్స్...

910

ఐపీఎల్‌లో కామెంటేటర్‌ చేసే అవకాశం వస్తే రమీజ్ రాజా, పీసీబీ ఛైర్మెన్ పదవికి రాజీనామా చేసి పరుగెత్తుకుంటూ వస్తాడని.. లేనిపోని బడాయిలు పోవడం మానేసి ఆడడానికి వచ్చిన వాళ్లకి కాస్త మంచి ఫుడ్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సలహా ఇస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

1010

ఆటగాళ్ల వేతనాలు చెల్లించేందుకు ఐసీసీకి బీసీసీఐ ఇచ్చే నిధుల మీద ఆధారపడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు... ఐపీఎల్ మీద కామెంట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు నెటిజన్లు... 

Read more Photos on
click me!

Recommended Stories