బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు, మూడో టెస్టులో చిత్తుగా ఓడింది. స్పిన్‌కి చక్కగా అనుకూలించిన ఇండోర్ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా చేతులు ఎత్తేశారు...
తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో చచ్చీ పడి లేని 163 పరుగులు చేయగలిగింది. ఇందులో పూజారా చేసిన హాఫ్ సెంచరీ (59), శ్రేయాస్ అయ్యర్ చేసిన 26 పరుగులు తీసేస్తే మిగిలిని బ్యాటర్లు అందరూ కలిపి చేసింది 78 పరుగులు...
26
Umesh Yadav-Virat kohli
‘టీమిండియా ఓటమికి ఎన్నో కారణాలు వెతకొచ్చు అయితే భారత బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారనే నిజాన్ని మాత్రం దాచిపెట్టలేం. టాపార్డర్‌లో ఏడుగురు బ్యాటర్లు ఉన్నారు కానీ వీరిలో ఒక్కరు కూడా సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నారు...
36
Rohit Sharma-Virat Kohli
స్పిన్ పిచ్‌ల మీద మనోళ్లు బ్యాటింగ్ చేయలేరా? ఇండియాలో దేశవాళీ క్రికెట్ ఆడినవాళ్లకు ఇలాంటి పిచ్ కొత్తేమీ కాదు. అయితే క్రీజులో ఎక్కువ సేపు ఉండాలనే ఆలోచన భారత బ్యాటర్లలో కనిపించలేదు...
46
Image credit: PTI
పిచ్ బ్యాటింగ్‌కి కష్టంగా మారినప్పుడు ఆ బ్యాటర్ సత్తా ఏంటో బయటికి వస్తుంది. ఇంతకంటే కఠినమైన పిచ్‌లో ఆడి గెలిచిన చరిత్ర మనది. ఓ వికెట్ పడగానే మిగిలిన బ్యాటర్లలో భయం మొదలవుతోంది. పిచ్‌లో ఏదో ఉంది, కష్టంగా ఉందనే మైండ్‌సెట్‌లోకి వెళ్లిపోతున్నారు. ఇదే త్వరగా వికెట్ కోల్పోవడానికి కారణం అవుతోంది...
56
Image credit: PTI
ప్రెషర్‌ని దూరం చేసుకోవడానికి పెద్ద షాట్స్ ఆడడం ఒక్కటే మార్గం కాదు. టెస్టుల్లో అలా ఆలోచిస్తే అన్ని వేళలా సక్సెస్ కాలేం.. కేవలం లోయర్ ఆర్డర్ బ్యాటర్ల వల్లే మ్యాచులు గెలుస్తాం. మొదటి రెండు టెస్టుల్లో అదే జరిగింది..
66
Image credit: Getty
మ్యాచులు గెలుస్తున్నంతకాలం లోపాలు ఎవ్వరికీ గుర్తు ఉండవు. ఒక్క ఓటమి పడితే అన్నీ లోపాలు బయటికి వస్తాయి. కొందరు ప్లేయర్లు పరుగులు చేయకపోయినా వారికి టీమ్‌లో చోటు ఉంటోంది. వారికి అండగా నిలుస్తోంది. ఇది చాలా అవసరం. అయితే అన్ని వేళలా ఇదే కరెక్ట్ కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్...