సచిన్‌కే తప్పలేదు! విరాట్ కోహ్లీ ఎంత... అయినా అందులో తప్పేముంది! - షోయబ్ అక్తర్...

Published : Mar 06, 2023, 11:05 AM IST

సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత బీసీసీఐతో విబేధాలతో వన్డే కెప్టెన్సీ కోల్పోయి, టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడు విరాట్ కోహ్లీ...

PREV
18
సచిన్‌కే తప్పలేదు! విరాట్ కోహ్లీ ఎంత... అయినా అందులో తప్పేముంది! - షోయబ్ అక్తర్...

బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్‌ చేతన్ శర్మ, సౌరవ్ గంగూలీకి విరాట్ కోహ్లీ నచ్చకపోవడం వల్లే అతన్ని బలవంతంగా వన్డే కెప్టెన్సీ తప్పించాల్సి వచ్చిందని స్టింగ్ ఆపరేషన్‌లో చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాయి. అయితే దీనిపైన పెద్ద రచ్చ కాకుండా బీసీసీఐ చాలా జాగ్రత్తలు తీసుకుంది...
 

28

‘నా దృష్టిలో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అంటే సచిన్ టెండూల్కర్. కానీ కెప్టెన్‌గా అతను పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. వరుస పరాజయాల తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా అంతే... కెప్టెన్సీ పోయాక అతను బ్యాటర్‌గా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు...

38

కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత తన ఆటపైనే ఫోకస్ పెట్టడానికి విరాట్ కోహ్లీకి కావాల్సిన సమయం దొరికింది. తన మనసు, మెదడు ఫ్రీ అయ్యాక పరుగులు చేయడం మొదలెట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అదరగొట్టాడు...

48
Image credit: PTI

విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి దాదాపు 40 సెంచరీలు ఛేజింగ్‌లోనే వచ్చాయి. జనాలందరూ నేను విరాట్ కోహ్లీని ఎక్కువగా పొగుడుతుంటానని అంటున్నారు. అవును, అందులో తప్పేముంది. ఈ తరంలో విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్‌ని చూపించగలరా?

58
Image credit: PTI

సచిన్ టెండూల్కర్‌లాగే, ఒకానొక సమయంలో టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మొత్తం విరాట్ కోహ్లీయే మోశాడు. ఆ మ్యాచులను, అలాంటి ఇన్నింగ్స్‌లను నేను ఎలా మరిచపోగలను...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్..
 

68
Image credit: PTI

2021 చివర్లో వన్డే కెప్టెన్సీ కోల్పోయి, 2022 జనవరిలో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. 2022 ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు...

78
Virat Kohli

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 136.40 స్ట్రైయిక్ రేటుతో నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, 98.66 సగటుతో 296 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. అంతకుముందు ఆసియా కప్ 2022 టోర్నీలోనూ 276 పరుగులు చేశాడు కోహ్లీ...

88
Image credit: PTI

అయితే టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అవుతూ టీమిండియాకి భారంగా మారుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలోనూ మొదటి 3 టెస్టుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు విరాట్ కోహ్లీ.. 

Read more Photos on
click me!

Recommended Stories