టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ రిజల్ట్ టీమిండియాపై బాగానే పడింది. అప్పటిదాకా టీమిండియాకి మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, పొట్టి ప్రపంచకప్ పరాభవంతో వన్డే కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఆసియా కప్‌లో ఎదురైన పరాజయాలతో టీమిండియా వ్యూహరచన చేస్తోందట..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. పొట్టి ప్రపంచకప్‌కి ముందు ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాతో మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లు ఆడుతోంది భారత జట్టు. ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్...ఈ సిరీస్‌ల ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు...
27
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. వార్మప్ మ్యాచుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్‌లపై ఘన విజయాలు అందుకుంది. అయితే ఆ తర్వాతే సీన్ మారింది. అసలు మ్యాచుల్లో భారత జట్టు తేలిపోయింది...
37
పాకిస్తాన్‌తో మ్యాచ్ పరాభవం తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్... న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆటపై ప్రభావం చూపాయి. ఆరంభం నుంచి నీరసంగా, నిరుత్సాహంగా ఆడిన భారత జట్టు, కివీస్‌తో మ్యాచ్‌లో ఓడి గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది...
47
దీంతో ఆటగాళ్లను మానసికంగా ప్రభావితం చేసి, వారి ఆటను దెబ్బ తీసే సోషల్ మీడియాకి దూరంగా క్రికెటర్లను ఉంచేందుకు ‘మిషన్ టీ20 వరల్డ్ కప్’ని ప్రవేశపెట్టాలని చూస్తోందట బీసీసీఐ. ఇందులో భాగంగా నెల రోజుల పాటు భారత క్రికెటర్లు మొబైల్ ఫోన్లు వాడకుండా, సోషల్ మీడియాకి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చూస్తోందట...
57
Rishabh Pant-Rohit Sharma
ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 19వ ఓవర్‌లో క్యాచ్ వదిలేయడంతో సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. ఇది అతని ఆటపై ప్రభావం చూపించింది కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీ20 వరల్డ్ కప్ 2022 ఆరంభం నుంచి ముగిసే వరకూ భారత ఆటగాళ్ల కదలికలపై ఆంక్షలు పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నాడట రాహుల్ ద్రావిడ్..
67
rohit sharma
విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. సోషల్ మీడియాలో జరిగే ప్రతీ కదలికలను గమనిస్తూ ఉంటాడు. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్ వంటి చాలామంది భారత క్రికెటర్లు కూడా ఇంతే. దీంతో వీరిని మొబైల్ వాడకుండా అడ్డుకోగలగడం సాధ్యమయ్యేపనేనా అనేది చాలా పెద్ద ప్రశ్న...
77
ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం పెట్టడం వల్ల రిజల్ట్ మారిపోతాయా? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు మరికొందరు. ఇంకొందరైతే మొబైల్ ఫోన్లు వాడొద్దు, సోషల్ మీడియా చూడొద్దు వంటి ఆంక్షలు విధించడానికి ఇది ఇంటర్ కాలేజీ టీమ్ లేదా డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ టీమ్ కాదని కామెంట్లు చేస్తున్నారు..