ఇప్పటికైనా ఆ ఇద్దరికీ క్లారిటీ వచ్చిందనుకుంటా... టీమిండియా ప్రయోగాలపై మాజీ కెప్టెన్ ఫైర్...

Published : Sep 18, 2022, 11:08 AM ISTUpdated : Sep 18, 2022, 11:10 AM IST

రోహిత్ శర్మ కెప్టెన్‌గా, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా ప్రయోగాల పుట్టగా మారింది.సిరీస్‌కో కెప్టెన్లను మారుస్తూ, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తూ, ఓపెనర్లను మారుస్తూ రకరకాల ప్రయోగాలు చేసింది టీమిండియా. ఆసియా కప్ 2022 టోర్నీలో ఈ ప్రయోగాలు టీమిండియాని చావుదెబ్బ తీశాయి...

PREV
16
ఇప్పటికైనా ఆ ఇద్దరికీ క్లారిటీ వచ్చిందనుకుంటా... టీమిండియా ప్రయోగాలపై మాజీ కెప్టెన్ ఫైర్...

గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్, హంగ్ కాంగ్‌లపై భారీ విజయాలు అందుకున్న టీమిండియా, సూపర్ 4 స్టేజీలో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో వరుసగా ఓడి ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌పై గెలిచి మిగిలిన కాస్త పరువు కాపాడుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది...

26

‘ఇకనైనా టీమిండియా ప్రయోగాలు చేయడం ఆపాలి. ఇప్పటికే వాళ్లకు క్లారిటీ వచ్చిందనుకుంటా. ప్రతీ మ్యాచ్‌లో టీమ్‌లో మార్పులు, చేర్పులు చేస్తూ పోతే... ఆటగాళ్లు అయోమయానికి గురవుతారు. ఈ అయోమయం టీమిండియాలో ఎప్పటి నుంచో ఉన్నదే...

36
Image credit: PTI

దీన్ని తొలగించాల్సిన అవసరం చాలా ఉంది. కెప్టెన్‌కీ, హెడ్ కోచ్‌కీ మధ్య ఎలాంటి సమన్వయం ఉందో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్లిద్దరూ కలిసే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేక ఒకరు తీసుకున్న నిర్ణయాలను మరొకరు కాదనలేక అంగీకరిస్తున్నారా... తెలియాలి.

46
Image credit: Getty

కనీసం మీడియా ముందైనా ఇద్దరూ ఒకే మాట నిలబడితే మంచిది. ప్రెస్ కాన్ఫిరెన్స్‌లు కూడా ఆటను ప్రభావితం చేస్తాయి. మీరేం మాట్లాడారో ఏం చెప్పాలో ప్లేయర్లకు తెలుస్తుంది. అది జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది...

56
rohit sharma

మీడియా ముందు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. గెలుపోటములు ప్రతీ ఆటలోనూ సహజం. అయితే టీమ్‌లో ఎలాంటి కంఫ్యూజన్ లేకుండా చూసుకోవడం చాలా అవసరం. ప్లేయర్లకు కుటుంబాలు ఉంటాయి. వారి అవసరాలు ఉంటాయి..

66
Image credit: PTI

ఆటగాళ్లను సరిగ్గా అర్థం చేసుకుంటే ఆటను మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్, కోచ్‌ ఒకే మాట మీద నిలబడితే... ఎలాంటి దానికైనా సమాధానం చెప్పొచ్చు.  ఇప్పటికైనా రోహిత్, రాహుల్ ద్రావిడ్‌లకు ఈ విషయంపై క్లారిటీ వచ్చిందనుకుంటా..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా...

Read more Photos on
click me!

Recommended Stories