90 ఓవర్లు... 381 పరుగులు... 9 వికెట్లు... టీమిండియా ఈ లెక్కను సరిచేయగలదా...

First Published Feb 9, 2021, 9:42 AM IST

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన సిరీస్... చెన్నై టెస్టులో గెలవాలంటే ఆఖరి రోజు 90 ఓవర్లలో మరో 381 పరుగులు చేయాల్సి ఉంటుంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే, ఫైనల్‌కి అర్హత సాధించడానికి మిగిలిన మూడు టెస్టుల్లో రెండు మ్యాచులు తప్పక గెలవాల్సి ఉంటుంది...

టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేధన 418 పరుగులే. 2003లో ఆస్ట్రేలియాపై, విండీస్ ఈ లక్ష్యాన్ని చేధించింది. ఇప్పుడు చెన్నై టెస్టులో గెలవాలంటే భారత జట్టు, ఆ స్కోరు కంటే 2 పరుగులు ఎక్కువే చేయాల్సి ఉంటుంది. అంటే 127 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చేధన రికార్డును సృష్టించాల్సి ఉంటుంది...
undefined
భారత జట్టు చేధించిన అత్యధిక లక్ష్యం 406 పరుగులు. 1976లో సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్ సెంచరీలతో చెలరేగి, వెస్టిండీస్‌కి ఊహించని షాక్ ఇచ్చారు. ఈరోజు భారత జట్టు విజయం సాధించాలంటే బ్యాట్స్‌మెన్ నుంచి ఇలాంటి ప్రదర్శన రావాలి...
undefined
ఆదివారం బంగ్లాదేశ్‌పై రికార్డు లక్ష్యాన్ని చేధించింది విండీస్. ఐదోరోజు 395 పరుగుల లక్ష్యాన్ని చేధించి, టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఐదో అత్యంత విజయవంతమైన లక్ష్యాన్ని చేధించింది. మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న కేల్ మేయర్, అజేయ డబుల్ సెంచరీతో తన జట్టుకి అఖండ విజయాన్ని అందించాడు...
undefined
ఇప్పుడు భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. నిర్భయంగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్లు ఉన్నారు. యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్... అందరికీ మించి భారత సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో చెలరేగితే ఈ లక్ష్యాన్ని చేధించడం పెద్ద కష్టమేమీ కాదు.
undefined
అయితే ఈ మధ్య కాలంలో భారత సారథి విరాట్ కోహ్లీ ఫామ్, భారత అభిమానులను భయపెడుతోంది. 2020 నుంచి ఏడు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 127 పరుగులే చేశాడు విరాట్ కోహ్లీ. గత ఏడాది కాలంగా ఆస్ట్రేలియాపై ఆడిలైడ్ వేదికగా చేసిన 74 పరుగులే అత్యధిక స్కోరు. ఇప్పుడు ఇంగ్లాండ్‌కి షాక్ ఇవ్వాలంటే విరాట్ మ్యాజిక్ చూపించాల్సిందే.
undefined
click me!